ETV Bharat / bharat

మణిపుర్​ గవర్నర్​ను కలిసిన 'ఇండియా' ఎంపీలు.. అక్రమ వలసదారులపై సర్కార్​ ఉక్కుపాదం!

Opposition Manipur Visit : మణిపుర్​ వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని.. లేదంటే దేశంలో సాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కాంగ్రెస్​ నేత అధీర్​ రంజన్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. మణిపుర్​ గవర్నర్​తో విపక్ష కూటమి నేతలు భేటీ అయ్యి.. మెమోరాండం సమర్పించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు అధీర్. మరోవైపు, మయన్మార్‌ నుంచి అక్రమంగా మణిపుర్​లోకి ప్రవేశించిన వారిని గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.

Opposition Manipur Visit
Opposition Manipur Visit
author img

By

Published : Jul 30, 2023, 12:16 PM IST

Updated : Jul 30, 2023, 12:41 PM IST

Opposition Manipur Visit : మణిపుర్​ వివాదాన్ని సత్వరమే పరిష్కరించకుంటే.. దేశంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కాంగ్రెస్ సీనియర్​ నేత అధీర్​ రంజన్ చౌదరి హెచ్చరించారు. ఆదివారం విపక్ష కూటమి నేతలతో కలిసి మణిపుర్ గవర్నర్​ అనసూయ ఉయికేను కలిసిన తర్వాత.. అధీర్​ రంజన్​ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 'గవర్నర్ మా అభిప్రాయాలను విన్నారు. వాటిపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. హింసాత్మక ఘటనలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. వర్గాల మధ్య అపనమ్మకం తొలగించడానికి.. ప్రజలతో మాట్లాడేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందం మణిపుర్‌ను సందర్శించాలని సూచించారు' అని ఆయన తెలిపారు.

  • #WATCH | After meeting Manipur Governor Anusuiya Uikey, I.N.D.I.A. alliance delegation addresses the media

    Congress MP Adhir Ranjan Chowdhury says, "...All 21 MPs handed over a memorandum to her. After we spoke with her, she herself expressed her pain and grief. During this… pic.twitter.com/W2pQXfLgK2

    — ANI (@ANI) July 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Opposition Delegation To Manipur : మణిపుర్​లో గత కొన్ని నెలలుగా జరుగుతున్న హింసాత్మక ఘటనల బాధితులను పరామర్శించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేయడానికి 21 మంది ఎంపీలతో కూడిన ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రతినిధి బృందం శనివారం మణిపుర్‌కు చేరుకుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు.. బిష్ణుపుర్​, చురాచంద్​పుర్​ జిల్లాల్లోని ఇంఫాల్​, మోయిరాంగ్​లో ఉన్న అనేక శిబిరాలను సందర్శించి.. బాధితులను కలుసుకున్నారు. అనంతరం ఆదివారం ఉదయం మణిపుర్​ గవర్నర్ అనసూయ ఉయికేను రాజ్​భవన్​లో కలిసి.. తమ పరిశీలనల మీద మెమోరాండం సమర్పించారు. మణిపుర్‌లో శాంతి పునరుద్ధరించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

  • The delegation of I.N.D.I.A. alliance submitted a memorandum to Manipur Governor Anusuiya Uikey today, requesting her to restore peace & harmony, taking all effective measures.

    "You are also requested to apprise the Union Government of the complete breakdown of law and order in… pic.twitter.com/97lnj2ROJb

'శిబిరాల్లో పరిస్థితి దారుణంగా ఉంది'
Manipur Relief Camps : 'ఒకే హాలులో 400 నుంచి 500 మంది బస చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్నం, పప్పు మాత్రమే అందిస్తోంది. పిల్లలకు రోజంతా తినడానికి వేరే ఏమీ లభించడం లేదు. శౌచాలయాల సౌకర్యం లేదు. శిబిరాల్లో ప్రజలు నివసిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది' అని కాంగ్రెస్ ఎంపీ ఫూలోదేవీ నేతమ్ తెలిపారు.

  • #WATCH | Congress MP Phulodevi Netam, a part of the I.N.D.I.A. delegation that is on a visit to Manipur, says, "...400-500 people are staying in one hall. The State Govt is providing them only daal-chawal, children are not getting anything else to eat the entire day. There is no… pic.twitter.com/9AHqfZgAh2

అక్రమ వలసదారులపై సర్కార్​ ఉక్కుపాదం!
Manipur Illegal Migrants : మణిపుర్‌లో శాంతి నెలకొల్పేందుకు అధికారులు దిద్దిబాటు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా మయన్మార్‌ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించిన వారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం మణిపుర్‌ ప్రజల నుంచి బయోమెట్రిక్‌ డేటాను సేకరిస్తున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. "మయన్మార్‌ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించి.. ఇక్కడే ఉంటున్న వారిని గుర్తించేందుకు బయోమెట్రిక్‌ డేటా సేకరణ ప్రారంభించాం. ఈ ప్రక్రియ సెప్టెంబరు చివరినాటికి పూర్తి చేస్తాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి డేటా సేకరించేందుకు జాతీయ నేరాల నమోదు సంస్థ నుంచి మణిపుర్‌కు ప్రత్యేక బృందాలు వచ్చాయి" అని మణిపుర్‌ హోంశాఖ జాయింట్ సెక్రటరీ పీటర్‌ సలామ్‌ తెలిపారు.

Last Updated : Jul 30, 2023, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.