మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణల వ్యవహారం... రాజ్యసభలో గందరగోళానికి దారితీసింది. ఫలితంగా ఎగువసభ ఒకసారి వాయిదా పడింది.
సభలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ సహా పలువురు నాయకులు దేశ్‌ముఖ్‌పై ఆరోపణల అంశాన్ని లేవనెత్తగా... విపక్ష నేతలు అభ్యంతరం తెలిపారు.
వన్యప్రాణుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో పంటల నాశనమవడంపై పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కాంగ్రెస్ నేత చాయా వర్మ ప్రశ్నించారు. దానికి బదులుగా దేశ్‌ముఖ్‌పై వస్తున్న ఆరోపణలను ప్రస్తావించారు జావడేకర్.