ETV Bharat / bharat

'హైకోర్టు జడ్జీలుగా మహిళలను నియమించాలి' - హైకోర్టు జడ్జీలుగా మహిళా న్యాయమూర్తులు

హైకోర్టుల్లో.. అర్హులైన మహిళా న్యాయమూర్తులను నియమించాలని మహిళా న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టును కోరింది. 1950 నుంచి ఇప్పటివరకూ సుప్రీంకోర్టులో కేవలం 8 మంది మహిళా న్యాయమూర్తులు మాత్రమే నియమితులయ్యారని గుర్తుచేసింది.

Only 2 woman judges in SC and 82 of 1,079 judges in HCs — judiciary has a gender problem
హైకోర్టు జడ్జీలుగా మహిళలను నియమించాలి
author img

By

Published : Apr 7, 2021, 12:11 PM IST

ఉన్నతస్థాయి న్యాయమూర్తుల్లో మహిళల వాటా కేవలం 11.04శాతం మాత్రమే ఉందని, వివిధ హైకోర్టు జడ్జీలుగా యోగ్యమైన మహిళా న్యాయమూర్తులను నియమించాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 'సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం(ఎస్​సీడబ్ల్యూఎస్ఏ)' దీన్ని దాఖలు చేసింది. ఈ అంశంలో గతంలో దాఖలైన కేసులో తమను కూడా ప్రతివాదిగా చేర్చాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.

"ఉన్నత స్థాయిలో 1,080 శాశ్వత అదనపు న్యాయమూర్తి పోస్టులు మంజూరు కాగా.. ప్రస్తుతం 661 మందే ఉన్నారు. అందులో మహిళా న్యాయమూర్తులు కేవలం 18 మందే! 1950 నుంచి ఇప్పటివరకూ సుప్రీంకోర్టులో మొత్తం 247మంది న్యాయమూర్తులు నియమితులు కాగా... వారిలో కేవలం 8 మందే మహిళలు! ప్రస్తుతం జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒక్కరే సర్వోన్నత న్యాయస్థానంలో సిట్టింగ్ జడ్జిగా ఉన్నారు," అని ఎస్సీడబ్ల్యూఎల్ఏ పేర్కొంది.

ఆ ప్రతిపాదనలకు ఆమోదం..

బొంబాయి హైకోర్టుకు చెందిన పదిమంది అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించే ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ ఎన్వీ.రమణ, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్లతో కూడిన త్రిసభ్య కొలీజియం సోమవారం సమావేశమైంది. ఆమోదించిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు వెబ్ సైట్లో మంగళవారం ఉంచారు. ఛత్తీస్​గఢ్ హైకోర్టుకు చెందిన ఓ అదనపు న్యాయమూర్తితో పాటు.. కేరళ హైకోర్టుకు చెందిన మరో ఐదుగురు అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించే ప్రతిపాదనలకు కూడా కొలీజియం ఆమోదం తెలిపింది.

ఇవీ చదవండి: మహిళలు పురుషులతో శక్తిసమానులు: సుప్రీం

'అట్టడుగు వ్యక్తి న్యాయం కోసం కోర్టు తలుపు తట్టాలి'

'విచారణ పూర్తి కాకముందే గోవుల జప్తా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.