ETV Bharat / bharat

Online Games Tax : ఆన్​లైన్​ గేమింగ్​పై 28 శాతం జీఎస్​టీ.. అక్టోబర్ నుంచే అమలు.. 6 నెలల తర్వాత సమీక్ష - ఆన్​లైన్ గేమింగ్స్​పై టాక్స్ పెంపు

Online Games Tax : ఆన్​లైన్ గేమింగ్​​పై 28 శాతం పన్ను అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

Online Games Tax
ఆన్​లైన్ గేమ్స్ పై 28 శాతం టాక్స్
author img

By

Published : Aug 2, 2023, 8:20 PM IST

Updated : Aug 2, 2023, 10:58 PM IST

Online Games Tax : Online Games Tax : ఆన్​లైన్ గేమింగ్​పై 28 శాతం జీఎస్​టీ అక్టోబర్ 1 నుంచి అమలవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జీఎస్​టీ మండలి భేటీ అనంతరం ఆమె ఈ ప్రకటన చేశారు. గుర్రపు పందాలు, క్యాసినో, ఇతర ఆన్​లైన్ బెట్టింగ్ గేమింగ్స్​పై పన్ను విధించాలని గతంలో మంత్రులు జీఎస్​టీ కౌన్సిల్​కు పలుమార్లు సిఫార్సు చేశారు. ఈ విషయంపై జీఎస్​టీ మండలి భేటీలో కూడా అనేక సార్లు చర్చించారు. కాగా గత నెల జరిగిన 50వ కౌన్సిల్ సమావేశంలో ఇది మరోసారి చర్చకు వచ్చింది. ఈ చట్టవిరుద్ధమైన గేమింగ్స్​పై 28 శాతం పన్ను విధించాలని మండలి ఏకాభిప్రాయ నిర్ణయానికి వచ్చింది. తాజా భేటీలో అమలు తేదీని ప్రకటించింది.

"బెట్టింగ్ సంబంధిత గేమ్స్​పై 28 శాతం పన్ను విధించాలని కౌన్సిల్.. ఇంతకుముందు భేటీలోనే నిర్ణయం తీసుకుంది. కాగా తాజా సమావేశంలో దాని అమలుపై నిర్ణయం తీసుకున్నాం. క్యాసినో, గుర్రపు పందాలు ఇతర ఆన్​లైన్ బెట్టింగ్ గేమింగ్స్​పై ఈ పన్ను వర్తిస్తుంది. ఈ జీఎస్​టీ అమలులోకి వచ్చిన ఆరు నెలల తర్వాత దీనిపై సమీక్ష నిర్వహిస్తాము."
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి.

కాగా రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్ర మాట్లాడుతూ.. "బెట్టింగ్ అనేది చట్టబద్ధం కాదు. జూదం, బెట్టింగ్ చట్ట విరుద్ధం. కాగా ఇవి ఇప్పటికే జీఎస్​టీ పన్ను పరిధిలో ఉన్నాయి. ఆన్​లైన్​ గేమింగ్​పై పన్ను విధించిన కారణంగా.. వీటిని నిషేధించిన రాష్ట్రల్లో ఈ గేమ్స్​ను లీగలైజ్ చేయడం కుదరదు" అని అన్నారు.

క్యాసినో, గుర్రపు పందాలు, ఆన్​లైన్ బెట్టింగ్ గేమింగ్​లపై పన్ను విధించేందుకు.. కౌన్సిల్ తాజా సమావేశంలో సీజీఎస్​టీ చట్టం, ఐజీఎస్​టీ చట్టం 2017లో కొన్ని సవరణలు చేసింది. కాగా 2017 జులై 1 నుంచి వస్తు, సేవల పన్ను దేశంలో అమలులోకి వచ్చింది.
28 Slab GST Goods : ప్రస్తుతం కార్బొనేటెడ్ డ్రింక్స్, పొగాకు, సిగరెట్స్, పొగాకుతో చేసిన వస్తువులు, స్మోకింగ్ పైప్స్, పాన్ మసాలా, డిష్​ వాష్ మెషిన్స్, ఎయిర్ కండిషనర్స్​, లాటరీలపై 28 శాతం జీఎస్​టీ ఉంది.

Last Updated : Aug 2, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.