ETV Bharat / bharat

'ఆన్​లైన్​ బెట్టింగ్'​పై కేంద్రం సీరియస్.. ఇక అవన్నీ బంద్! - డిజిటల్​ మీడియా

Online betting advertising: ఆన్​లైన్​ బెట్టింగ్ ప్రచార ప్రకటనలపై కొరడా ఝుళిపించింది కేంద్రం. బెట్టింగ్​, గ్యాంబ్లింగ్​ వంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్​, ఎలక్ట్రానిక్​, డిజిటల్​ మీడియాలకు అడ్వైజరీ జారీ చేసింది.

Online betting advertising
ఆన్​లైన్​ బెట్టింగ్​ ప్రకటనలు వద్దు
author img

By

Published : Jun 13, 2022, 4:31 PM IST

Online betting advertising: ఆన్​లైన్​ బెట్టింగ్​ ప్లాట్​ఫామ్స్ ప్రచార ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్​, ఎలక్ట్రానిక్​, డిజిటల్​ మీడియాలకు అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆన్​లైన్​ బెట్టింగ్​, గ్యాంబ్లింగ్​ చట్ట విరుద్ధమని పేర్కొంది. ఆన్​లైన్​ బెట్టింగ్​, గ్యాంబ్లింగ్​ వంటి వాటిని వినియోగిస్తున్న వారికి ఆర్థిక, సామాజిక నష్టాన్ని పెంచుతాయని పేర్కొంది కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ.

" ఆన్​లైన్​ బెట్టింగ్​ ప్లాట్​ఫామ్స్​ ప్రకటనలను ప్రచురించవద్దు. ఆన్​లైన్​ అడ్వర్టైజ్​మంట్​ పబ్లిషర్స్​, ఇండటర్​మీడియరీస్​ సహా ఆన్​లైన్​, సోషల్​ మీడియాలు సైతం ప్రకటనలకు దూరంగా ఉండాలి. బెట్టింగ్​, గ్యాంబ్లింగ్​.. దేశంలోని చాలా ప్రాంతాల్లో చట్టవిరుద్ధం. ముఖ్యంగా చిన్నారులు, యువత సహా వాటిని వినియోగదారులకు ఆర్థిక, సామాజిక నష్టాన్ని పెంచుతాయి. ఆయా ప్రకటనల ద్వారా చట్టవిరుద్ధమైన ఈ చర్యను ప్రోత్సహించినట్లవుతుంది."

- కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ

ఇటీవల ప్రింట్​, ఎలక్ట్రానిక్​, సోషల్​​, ఆన్​లైన్​ మీడియాల్లో ఆన్​లైన్​ బెట్టింగ్​ వెబ్​సైట్స్​ ప్రకటనలు పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ అడ్వైజరీ జారీ చేసింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు సూచనలు చేసినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: ఢమాల్ స్ట్రీట్​.. రూ.7లక్షల కోట్లు ఆవిరి.. రూపాయి పతనంలో నయా రికార్డ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.