కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి నేటితో ఏడాది. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం సహా.. వైరస్ను ఎదుర్కొనేందుకు దేశ వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో.. అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలపై 2020 మార్చి 24 అర్ధరాత్రి నుంచి ఆంక్షలు విధించింది కేంద్రం. ప్రపంచంలో అత్యంత కఠినంగా అమలైన లాక్డౌన్గా ఇది రికార్డుకెక్కింది. తొలుత 21 రోజులు విధించిన ఈ లాక్డౌన్ను క్రమంగా మూడుసార్లు పొడిగించారు.

ఇదీ చదవండి: భారత్ బంద్: లాక్డౌన్గా మారిన జనతా కర్ఫ్యూ!
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
లాక్డౌన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. రికార్డు స్థాయిలో జీడీపీ పడిపోయేందుకు కారణమైంది. సాంకేతికంగా దేశాన్ని మాంద్యంలోకి నెట్టింది. అయితే.. ఎంత వేగంగా పడిపోయిందో.. అంతే వేగంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. పెట్టుబడులు పెరిగాయి. జీడీపీ గాడిలో పడింది. వచ్చే ఏడాది రికార్డు స్థాయి వృద్ధి నమోదవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి.

సానుకూలతలు
- కరోనా కట్టడికి బలోపేతంగా మారిన వైద్య వ్యవస్థ
- పరీక్షల సామర్థ్యం, ల్యాబ్లు, పరికరాల పెంపు
- మానవ కార్యకలాపాలు పరిమతం కావడం వల్ల పర్యావరణానికి మేలు
- తగ్గిన కాలుష్యం
- తగ్గిన రోడ్డు ప్రమాదాలు, మరణాలు
- పెరిగిన సాంకేతికత వినియోగం
- ఓటీటీ, ఈ-కామర్స్ సేవలకు పెరిగిన డిమాండ్
- చాలా ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఆన్లైన్ విద్య
- స్వచ్ఛత, పరిశుభ్రతపై పెరిగిన అవగాహనహిమాచల్ప్రదేశ్లో నిర్మానుష్యంగా ప్రాంతం
ప్రతికూల ప్రభావాలు
- లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
- ఇప్పటికీ కోలుకోని పలు రంగాలు
- గణనీయంగా పెరిగిన నిరుద్యోగం
- స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కార్మికుల తిప్పలు
- పని కోల్పోయి రోజువారీ కూలీల అవస్థలుయువకుడికి మాస్క్ అందిస్తున్న యూపీ పోలీస్
ఇవీ చదవండి:
- లాక్డౌన్ వేళ వలస కూలీలకు రక్షణేది?
- 'నీళ్లు తాగి బతుకుతున్నాం.. మమ్మల్ని పంపేయండి'
- చంకలో బిడ్డ, నెత్తిన మూటతో 16 రోజులుగా పాదయాత్ర!
- 'వలస' బతుకులు: నడిచి.. నడిచి.. ప్రాణం విడిచి!
- ట్రెండింగ్ భారత్: ట్రంప్.. మోదీ.. ఓ వలస కూలీశ్రామిక్ రైలులో ప్రయాణించేందుకు మహారాష్ట్రలోని బాంద్రా రైల్వే స్టేషన్కు పోటెత్తిన కూలీలు
కరోనా కట్టడి..
లాక్డౌన్ తర్వాత కరోనా కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ.. ప్రస్తుతం మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 153 రోజుల్లో ఇదే అత్యధికం కావడం దేశ ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. కొన్ని రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతుంటడం.. మళ్లీ లాక్డౌన్ రోజులను గుర్తు తెస్తోంది.

అప్పుడలా.. ఇప్పుడిలా..
అంశం | అప్పుడు | ఇప్పుడు |
ల్యాబ్ల సంఖ్య | 57 | 2,425 |
పరీక్షల సామర్థ్యం | వేలల్లో | సగటున పది లక్షలు |
కేసులు | 564 | 1,17,87,534 |
అయితే, టీకా అందుబాటులోకి రావడం కరోనా పోరులో ఓ సానుకూలాంశం. 5.31 కోట్లకు పైగా డోసులను ఇప్పటికే పంపిణీ చేశారు.

కేసుల పెరుగుదల నేపథ్యంలో కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. చేతులు తరచుగా కడుక్కోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటివి అనుసరించాలని చెబుతున్నారు.
ఇదీ చదవండి: జనతా కర్ఫ్యూకు ఏడాది- మళ్లీ అదే పరిస్థితా?