పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు గుడ్‌బై చెప్పగా.. బలపరీక్షకు ముందు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
రాజ్‌భవన్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ నారాయణ్, తట్టాన్చవాడి నియోజకవర్గానికి చెందిన డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్.. ఈ మేరకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్నీ సైతం వదులుకున్నట్లు లక్ష్మీనారాయన్ తెలిపారు. సీఎం నారాయణసామి నేతృత్వంలోని ప్రభుత్వం మెజారిటీని కోల్పోయిందని అన్నారు.
వీరిద్దరి రాజీనామాతో అసెంబ్లీలో కాంగ్రెస్ కూటమి(కాంగ్రెస్, డీఎంకే, స్వతంత్రులు కలిపి) బలం 12కు పడిపోయింది. మరోవైపు విపక్షాలకు సభలో 14 స్థానాలు ఉన్నాయి. పుదుచ్చేరిలో మొత్తం 33 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో ఈ నెల 22న శాసనసభలో బలనిరూపణ చేసుకోవాలని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై.. ప్రభుత్వానికి ఇదివరకే స్పష్టం చేశారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: