ETV Bharat / bharat

'తొలి రోజు లక్షా 91వేల మందికి కరోనా టీకా' - టీకా డోసు తీసుకోవడంపై వివరణ ఇచ్చిన హర్ష్​ వర్ధన్

దేశవ్యాప్తంగా శనివారం ప్రారంభమైన కొవిడ్ వ్యాక్సినేషన్​ ప్రక్రియలో భాగంగా.. తొలి రోజు లక్షా 91వేల మందికి పైగా టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియకు సంబంధించిన మరికొన్ని వివరాలు తెలిపింది.

one lakh sixty five thousand beneficiaries inoculated with COVID-19 vaccines
'తొలి రోజు లక్షా 65 వేల మందికిపైగా టీకా'
author img

By

Published : Jan 16, 2021, 8:02 PM IST

Updated : Jan 16, 2021, 8:42 PM IST

దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్​ ప్రక్రియ మొదలై... తొలి రోజు ముగిసేనాటికి 1,91,181 మందికి కరోనా టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియలో 16,755 మంది వైద్య సిబ్బంది పాల్గొన్నారని తెలిపింది.

vaccination in states
వ్యాక్సినేషన్​ ప్రక్రియ వివరాలు

మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 3,351 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్​ ప్రక్రియ జరిపినట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మొదటి వ్యాక్సిన్​ డోసు తీసుకున్న తర్వాత ఒక్కరు కూడా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరలేదని పేర్కొంది.

vaccination in states
వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్​ ప్రక్రియ
vaccination in states
రాష్ట్రాల వారీగా కొవిడ్ వ్యాక్సినేషన్​ ప్రక్రియ వివరాలు

టీకా అప్పుడే తీసుకుంటా: ఆరోగ్య మంత్రి

నాయకులు టీకా డోసు ఎందుకు తీసుకోవడం లేదంటూ వస్తోన్న విమర్శలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ స్పందించారు. టీకా తీసుకోవడానికి తమ వంతు వచ్చేదాకా వేచి చూడాలని అన్నారు. '50 ఏళ్లు పైబడినవారికి టీకా ఇవ్వడం ప్రారంభించాక అప్పుడు నేనూ టీకా తీసుకుంటా,' అని ఆరోగ్య మంత్రి అన్నారు. వ్యాక్సిన్​ తీసుకోవడంపై వస్తోన్న వదంతులను నమ్మరాదని పేర్కొన్నారు. ప్రముఖ డాక్టర్లు సైతం టీకా డోసు తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

టీకా తీసుకున్నామని అజాగ్రత్త వద్దు: మోదీ

కొవిడ్ టీకా సంజీవనిలా పనిచేస్తుంది: హర్షవర్ధన్

టీకా పంపిణీపై ఎవరెవరు ఏమన్నారంటే..?

Last Updated : Jan 16, 2021, 8:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.