తమిళనాడులోని నమక్కల్ జిల్లా ఆంజనేయర్ దేవాలయంలో భక్తులు మంగళవారం ఘనంగా పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా లక్షా ఎనిమిది వడా మలై(వడ)లతో ఆంజనేయ విగ్రహాన్ని అలంకరించారు.
ఉదయం 4.45 గంటలకు స్వామి వారికి ప్రత్యేక ఆరాధన, అభిషేకం చేసి వడా మలై కార్యక్రమం చేశారు. ఆంజేయర్ స్వామి దర్శనార్థం భక్తులు ఇతర రాష్టాల నుంచీ భారీ సంఖ్యలో తరలివచ్చారు.
![anjaneyar temple in tamil nadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-nmk-01-hanuman-jayanti-one-lac-vada-script-vis-tn10043_12012021061216_1201f_1610412136_624_1201newsroom_1610437305_162.jpg)
ఆంజనేయుడి అనుగ్రహం కోసం లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆలయ కమిటీ నిబంధనలు పెట్టింది. కొవిడ్ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేసి భక్తులను పరీక్షించింది.