ETV Bharat / bharat

''ఒకే జిల్లా- ఒకే ఉత్పత్తి'తోనే ఆత్మనిర్భరత'

పరిపాలనలో ప్రజలకు సముచిత స్థానాన్ని కల్పించాలని భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఆత్మనిర్భర భారత్​ను బలోపేతం చేసేదిశగా ప్రభుత్వాలు పనిచేయాలని పిలుపునిచ్చారు.

pm modi
ప్రధాని మోదీ
author img

By

Published : Dec 14, 2021, 11:30 PM IST

పాలనా విధానంలో ప్రజలకు సముచిత స్థానం కల్పించాలని భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆత్మనిర్భర భారత్​ను బలోపేతం చేసేదిశగా, దేశఆర్థికరంగాన్ని పెంపొందించే విధంగా.. 'వన్ డ్రిస్ట్రిక్ట్​, వన్ ప్రొడక్ట్​' పద్ధతిలో పనిచేయాలని తెలిపారు. వారణాసిలో భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు.

స్థానిక ఉత్పత్తులను ప్రపంచస్థాయి మార్కెట్​లో విక్రయించి.. ఆ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థానం కల్పించాలన్నారు మోదీ. పరిపాలనలో సాంకేతికతను జోడిస్తే అద్భుతమైన ఫలితాలను రాబట్టొచ్చని సూచించారు. చిన్నారులు, మహిళలకు పౌష్టికాహారం అందించాలన్నారు. దేశయువత ఫిట్​గా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: 'ప్రజల గొంతుకను అణచివేసేందుకు కేంద్రం కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.