ETV Bharat / bharat

ఆధార్, ఓటర్, పాస్​పోర్ట్... ఇక అన్నింటికీ ఒకే ఐడీ! - అన్నీ దరఖాస్తులకు ఒకే డిజిటల్​ ఐటీ

One digital ID: 'ఒకే డిజిటల్‌ ఐడీ' మరోసారి తెరమీద వచ్చింది. దీనిని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇది అమలులోకి వస్తే ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్ట్‌, పాన్‌.. ఇలాంటి గుర్తింపు పత్రాలన్నింటినీ ఒకే ఐడీకి అనుసంధానం చేస్తారు.

One digital ID that links, can access other IDs
వాటి అనుసంధానికి ఒకే డిజిటల్​ ఐడీ.!
author img

By

Published : Jan 31, 2022, 5:31 AM IST

Updated : Jan 31, 2022, 7:15 AM IST

One digital ID: ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్ట్‌, పాన్‌.. ఇలాంటి గుర్తింపు పత్రాలన్నింటినీ (ఐడీలను) అనుసంధానం చేస్తూ కొత్తగా 'ఒకే డిజిటల్‌ ఐడీ'ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డిజిటల్‌ గుర్తింపు పత్రాల సమాకలనం (ఫెడరేటెడ్‌ డిజిటల్‌ ఐడెంటిటీస్‌)గా ఈ కొత్త మోడల్‌ను రూపొందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ ఓ ప్రతిపాదన తయారు చేసినట్లు సమాచారం.

ఓ వార్తా సంస్థ సమాచారం మేరకు.. కేంద్రం కొత్త ప్రతిపాదనలో భాగంగా ఆధార్‌ కార్డు నంబరు మాదిరిగా దీనికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్య ఉండొచ్చని అంటున్నారు. ఏ కార్డు అవసరమైతే ఆ కార్డును అప్పటికప్పుడు వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రతిపాదనను రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐడీల సమాచారం మొత్తాన్ని ఒకేచోట ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) లేదా ఈ-కేవైసీకి ఈ డిజిటల్‌ ఐడీని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం దేశ పౌరులు వివిధ అవసరాల కోసం ఆధార్‌, ఓటరు గుర్తింపు, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు వంటివాటిని ప్రభుత్వ గుర్తింపు కార్డులుగా వాడుతున్నారు. వీటన్నింటి స్థానంలో ఒకే డిజిటల్‌ ఐడీ ఉండటం మేలని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. పూర్తి అధ్యయనం, రక్షణ చర్యలు తీసుకున్న తర్వాతే అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. దీన్ని త్వరలోనే ప్రజాభిప్రాయానికి కేంద్ర ఐటీ శాఖ అందుబాటులో ఉంచుతుందని సమాచారం.

ఇదీ చూడండి: 38 మంది సభ్యుల 'ఆర్మీ ఫ్యామిలీ'.. తరతరాలుగా దేశ సేవలోనే..

Last Updated : Jan 31, 2022, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.