ETV Bharat / bharat

పెళ్లైన తర్వాత రోజే భార్య ప్రసవం.. తల్లీబిడ్డలను వదిలి భర్త పరార్​.. చివరకు - పెళ్తైన మరుసటి రోజే ప్రసవం

ప్రేమ పేరుతో యువతిని గర్భవతి చేశాడు ఓ యువకుడు. అనంతరం పెళ్లికి ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల గత నెల 28న వివాహం చేసుకున్నాడు. అయితే తరువాతి రోజే బాధితురాలు మగబిడ్డకు జన్మనిచ్చింది. మళ్లీ ఆమెను వదిలేసి పారిపోయాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

pregnant woman giving birth baby
ప్రేమించి మోసం చేసిన యువకుడు
author img

By

Published : Oct 1, 2022, 10:14 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ హమీర్​పుర్​లో ఓ విచిత్ర ఘటన జరిగింది. పెళ్లయిన మరుసటి రోజే బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. నవజాత శిశువు పుట్టగానే బాధితురాలి భర్త ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు తెలిపిన ప్రకారం.. బాధితురాలు ఓ వ్యక్తి తనను ప్రేమ పేరుతో మోసగించి గర్భం దాల్చేలా చేశాడని సెప్టెంబరు 13న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం తాను ఎనిమిది నెలల గర్భిణీనని ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. దీంతో పోలీసులు ఆమె ప్రియుడ్ని పోలీస్​స్టేషన్​కు పిలిపించి పెళ్లికి ఒప్పించారు.

సెప్టెంబరు 28న బాధితురాలికి ఆమె ప్రియుడితో వివాహమైంది. ఆ మరుసటి రోజే బాధితురాలికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆమె భర్త ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. బాధితురాలు, నవజాత శిశువు ఆరోగ్యం క్షీణించింది. దీంతో వైద్యులు హమీర్‌పుర్ జిల్లా ఆసుపత్రికి రిఫెర్​ చేశారు.

అయితే మళ్లీ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త తనను, బిడ్డను వదిలేసి వెళ్లిపోయినట్లు తెలిపింది. పోలీసులు వెళ్లి అతడ్ని వెతికి స్టేషన్​కు తీసుకొచ్చారు.

ఇవీ చదవండి: బాలికపై గ్యాంగ్​రేప్​.. నిందితుల్లో ఇద్దరు పోలీసులు.. జాబ్​ పేరుతో లైంగిక వేధింపులు!

భర్తకు గుండెపోటు.. నోటి ద్వారా శ్వాస అందించి ప్రాణం పోసిన భార్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.