ETV Bharat / bharat

తలపై రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్టు టాప్​ కమాండర్​ అరెస్ట్​! - prashant bose arrest

తలపై రూ.కోటి రివార్డు ఉన్న సీపీఐ మావోయిస్టు టాప్ కమాండర్​ను ఝార్ఖండ్​ పోలీసులు అరెస్టు చేశారు. అతని భార్యను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

one-crore-rewarded-naxalite-prashant-bose-arrested-from-jamshedpur
తలపై రూ.కోటి రివార్డు ఉన్న నక్సలైట్ అరెస్ట్​!
author img

By

Published : Nov 12, 2021, 1:23 PM IST

Updated : Nov 12, 2021, 8:01 PM IST

మావోయిస్టులపై పోరులో(maoist latest news) ఝార్ఖండ్ పోలీసులు కీలక విజయం సాధించారు. తలపై రూ.కోటి రివార్డు ఉన్న సీపీఐ మావోయిస్టు(cpi maoist ) టాప్​ కమాండర్​​ ప్రశాంత్ బోస్​ను జంషెద్​పుర్​లో అరెస్టు చేశారు(Prashant bose arrest). అతని భార్య శీలా మరాండీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ సురక్షితమైన ప్రదేశంలో విచారిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

  • ప్రశాంత్​ బోస్​ను 'కిషన్ దా'(prashant bose maoist) అని కూడా పిలుస్తారు. అత్యంత సీనియర్ మావోయిస్టు నాయకుల్లో ఈయన ఒకరు. మవోయిస్టు కమ్యూనిస్టు సెంటర్​ ఆఫ్ ఇండియా(ఎంసీసీఐ) చీఫ్​గా వ్యవహరించారు. ఆ తర్వాత అది 2004లో సీపీఐ-ఎంఎల్​(పీపుల్స్​ వార్​)లో విలీనమైంది. విప్లవ శక్తుల పునరేకీకరణను పర్యవేక్షించిన సిద్ధాంతకర్తలలో కిషన్ దా ఒకరు. ఆ తర్వాత ఇది అత్యంత ప్రమాదకరమైన మావోయిస్టు సంస్థ సీపీఐ(మావోయిస్ట్) ఏర్పాటుకు దారితీసింది.
  • కిషన్​ దా(Prashant bose ) ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో, కేంద్ర మిలిటరీ కమిషన్​లో సభ్యుడు. మావోయిస్టు పార్టీ తూర్పు ప్రాంత కార్యదర్శి. ఈశాన్య రాష్ట్రాలైన బిహార్, ఝార్ఖండ్​ సహా బంగాల్​, ఉత్తర్​ప్రదేశ్​లో విప్లవ కార్యకలపాలను పర్యవేక్షిస్తున్నారు. 75 ఏళ్ల వయసున్న ఈయన ఆనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం. ఝర్ఖండ్​లోని సరందా అడవుల్లో మావోయిస్టు కార్యకలాపాలు సాగించారు.
  • కిషన్​ దా స్వస్థలం బంగాల్​లోని జాదవ్​పుర్​. సన్నిహితులు నిర్భయ్, కిషన్, కాజల్, మహేశ్​ అనే పేర్లతో పిలుస్తారు.
  • కిషన్ దా సతీమణి శీలా మరాండీ కూడా మాయియిస్టు పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు. సీపీఐ మవోయిస్టు కేంద్ర​ కమిటీ సభ్యుల్లో ఉన్న ఏకైక మహిళ. 60ఏళ్లకు పైగా వయసుంటుంది. గతంలో 2006లో ఒడిశాలో ఈమె అరెస్టయ్యారు. ఆ తర్వాత రూర్కెలా జైలు నుంచి విడుదలయ్యారు. ఐదేళ్ల క్రితం మళ్లీ 'సీపీఐ మావోయిస్టు'లో చేరారు. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు అనుంబంధంగా మహిళా సంస్థలకు నిర్దేశం చేసే ఇంఛార్జ్​గా వ్యవహరించారు.
  • శీలా స్వస్థలం ఝార్ఖండ్​లోని ధన్​బాద్ జిల్లా. హేమ, ఆశ, బుధాని, ష్పబది అనే మారు పేర్లున్నాయి.
    one-crore-rewarded-naxalite-prashant-bose-arrested-from-jamshedpur
    ప్రశాంత్ బోస్​, ఆయన సతీమణి శీలా మరండీ

సీపీఐ(మావోయిస్టు) పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకుల అరెస్టు మావోయిస్టు కార్యకర్తల నైతికతపై ప్రభావం చూపుతుంది. ఉత్తర భారత దేశంలో ఇప్పటికే నలుగుతున్న విప్లవ కార్యకలాపాలను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశముంది. అయితే ఝార్ఖండ్​ పోలీసులకు వీరు ఎలా పట్టుబడ్డారనే విషయం తెలియాల్సి ఉంది. అధికారులు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇదీ చదవండి: విమానంలోనే దర్జాగా స్మోకింగ్​- ఆంధ్ర వ్యక్తి అరెస్ట్​

Last Updated : Nov 12, 2021, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.