మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా.. ఆయన కుమారుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. దిల్లీలోని వీర్ భూమి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, రాజీవ్ సేవలను స్మరించుకున్నారు.
కాంగ్రెస్ నేతల నివాళులు
రాజీవ్ గాంధీకి.. కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌదరీ నివాళులర్పించారు. దిల్లీలోని వీర్ భూమి వద్ద పుష్పాలతో శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ప్రధాని సేవలను గుర్తు చేసుకున్నారు.
మోదీ నివాళి
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ఇదీ చూడండి: రాజీవ్ గాంధీకి రాహుల్ నివాళులు