ETV Bharat / bharat

రాజస్థాన్​లో ఒకేసారి నాలుగు ఒమిక్రాన్ కేసుల నిర్ధరణ - రాజస్థాన్ జైపూర్ కరోనా ఒమిక్రాన్

Omicron in Rajasthan: రాజస్థాన్​లో ఒకేసారి నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. విదేశాల నుంచి జైపుర్​ వచ్చిన వీరికి కరోనా నిర్ధరణ కాగా.. జీనోమ్ సీక్వెన్సింగ్​లో ఒమిక్రాన్ పాజిటివ్​గా తేలింది. ఇప్పటికే జైపుర్​లో 9 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.

omicron in rajasthan
omicron in rajasthan
author img

By

Published : Dec 13, 2021, 8:25 AM IST

Omicron in Rajasthan: దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతోంది. రాజస్థాన్​లో కొత్తగా నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. బాధితులంతా విదేశాల నుంచి వచ్చినవారేనని అధికారులు తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించిన తర్వాత ఫలితాలు పాజిటివ్​గా వచ్చాయని వెల్లడించారు.

India Omicron cases

బాధితులు భారత్​కు రాగానే ఎయిర్​పోర్ట్​లో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. అందులో కరోనా ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో వీరిని ఐసోలేషన్​కు తరలించి.. నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఎస్ఎంఎస్ మెడికల్ కళాశాలకు పంపించారు. ఈ రిపోర్టుల్లో ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది.

కాంటాక్ట్ ట్రేసింగ్

దీంతో బాధితులకు సన్నిహితంగా మెలిగినవారి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ఇప్పటికే జైపుర్​లో 9 మంది బాధితులు ఒమిక్రాన్ బారినపడ్డారు.

ఆదివారం పలు రాష్ట్రాల్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. చండీగఢ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో కేసులు వెలుగుచూశాయి.

ఇదీ చదవండి: మరిన్ని రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాప్తి.. దేశంలో 38కి చేరిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.