ETV Bharat / bharat

Omicron In India: ఆ దేశ ప్రయాణికులకు ఏడు రోజుల క్వారంటైన్ - ఒమిక్రాన్ కేసులు భారత్​లో

Omicron In India: ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావిత దేశాలనుంచి వచ్చే ప్రయాణికులు ఏడురోజులపాటు క్వారంటైన్​లో ఉండటాన్ని తప్పనిసరి చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది.

Maharashtra Omicron
మహారాష్ట్ర ఒమిక్రాన్
author img

By

Published : Dec 1, 2021, 11:53 AM IST

omicron in india: ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ వేరియంట్​ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారు ఏడు రోజులపాటు క్యారంటైన్​లో ఉండటాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతున్న దృష్ట్యా ఈనిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Omicron Maharashtra: ప్రయాణికుడికి వైరస్ పరీక్షలో పాజిటివ్​గా తేలితే.. ఆస్పత్రికి పంపించనున్నారు. రిపోర్టు నెగెటివ్ అయితే ఏడురోజులపాటు హోం క్వారంటైన్​లోకి వెళ్లాల్సిఉంటుంది.

యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్​వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్​, ఇజ్రాయెల్​.. దేశాలు ప్రస్తుతం ఒమిక్రాన్ ప్రభావిత దేశాలుగా ఉన్నాయి.

మిగతా దేశాలనుంచి వచ్చే ప్రయాణికులు విమానాశ్రయంలో కచ్చితంగా ఆర్​టీ-పీసీఆర్ పరీక్ష చేయిం​చుకోవాలి. పాజిటివ్ వస్తే ఆస్పత్రికి, నెగెటివ్​గా నిర్ధరణ అయితే 14 రోజులపాటు హోం క్వారంటైన్​లో ఉండాలి.

Omicron Virus In India: దేశంలో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదుకాలేదని కేంద్ర ఆరోగ్యకార్యదర్శి రాజేష్ భూషణ్​.. మంగళవారం తెలిపారు. విమానాశ్రయాలు, సరిహద్దు మార్గాలు, సముద్రమార్గాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టిసారించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశించారు.

ఇదీ చూడండి: Corona cases in India: లక్ష దిగువకు కరోనా యాక్టివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.