ETV Bharat / bharat

'ఇమ్యూనిటీని ఏమార్చే సామర్థ్యం ఒమిక్రాన్​కు ఎక్కువే'

Omicron Immune Escape: రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునే సామర్థ్యం కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​కు అధికంగా ఉన్నట్లు కరోనా జన్యు క్రమాన్ని విశ్లేషించే కన్సార్షియం (ఇన్సాకాగ్‌) పేర్కొంది. టీకా సామర్థ్యాన్నిసైతం గణనీయంగా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు తగిన ఆధారాలున్నట్లు తెలిపింది.

omicron immune escape
omicron immune escape
author img

By

Published : Dec 29, 2021, 6:31 PM IST

Omicron Immune Escape: ఒమిక్రాన్​కు రోగ నిరోధక శక్తిని ఏమార్చే సామర్థ్యం అధికంగా ఉన్నట్లు కరోనా జన్యు క్రమాన్ని విశ్లేషించే కన్సార్షియం (ఇన్సాకాగ్‌) తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రయోగాత్మక, క్లినికల్​ డేటా ఉన్నట్లు వెల్లడించింది. టీకా సామర్థ్యాన్ని సైతం ఒమిక్రాన్​ గణనీయంగా తగ్గిస్తున్నట్లు కనిపిస్తోందని గ్లోబల్ డేటాను ఉటంకిస్తూ తెలిపింది. వైరస్​ వేగంగా వ్యాప్తి చెందడానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొంది.

అయితే డెల్టా వేరియంట్​ కంటే ఒమిక్రాన్​ వల్ల వ్యాధి తీవ్రత, లక్షణాలు తక్కువగా ఉన్నట్లు ఇన్సాకాగ్​ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ డెల్టా ఆందోళనకర వేరియంట్​గా కొనసాగుతోందని పేర్కొంది.

"ప్రపంచవ్యాప్తంగా డెల్టా అత్యంత ఆందోళనకర వేరియంట్​గా కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాలో మాత్రం డెల్టా స్థానాన్ని ఒమిక్రాన్​ భర్తీ చేసింది. ఇప్పుడు బ్రిటన్​ సహా ఇతర దేశాల్లోనూ ఉద్ధృతంగా వ్యాపిస్తోంది" అని ఇన్సాకాగ్​ తాజా ప్రకటనలో పేర్కొంది.

దేశంలో 21 రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఇప్పటివరకు 781మంది కొత్త వేరియంట్​ బారిన పడ్డారు. వారిలో 241 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇదీ చూడండి: విస్తరిస్తున్న ఒమిక్రాన్.. ఆంక్షల్లోకి మరిన్ని రాష్ట్రాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.