ETV Bharat / bharat

దిల్లీలో ఒమిక్రాన్‌ రెండో కేసు.. ముంబయిలో 144 సెక్షన్‌

Omicron cases in Maharashtra: దేశంలో మహారాష్ట్రంలోనే అత్యధికంగా 17 ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులు వెలుగు చూశాయి. ముంబయిలోని ధారావిలో తొలి కేసు నమోదైంది. ఈ క్రమంలో రెండు రోజుల పాటు 144 సెక్షన్​ విధించారు అధికారులు. ర్యాలీలు, మోర్చాలపై నిషేధం విధించారు. దిల్లీలో ఒమిక్రాన్​ రెండో కేసు నమోదైంది.

omicron-cases-in-maharashtra
'మహా'లో ఒమిక్రాన్‌ కలవరం
author img

By

Published : Dec 11, 2021, 10:45 AM IST

Updated : Dec 11, 2021, 2:58 PM IST

Omicron cases in Maharashtra: మహారాష్ట్రలో 'ఒమిక్రాన్‌' వేరియంట్​ కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 7 కేసులు వెలుగు చూశాయి. ఇందులో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో శనివారం నుంచి రెండు రోజుల పాటు 144 సెక్షన్‌ విధించారు. ర్యాలీలు, మోర్చాలు వంటి కార్యక్రమాలపై నిషేధం విధించారు. అధిక సంఖ్యలో ప్రజలు ఒకచోట గుమిగూడరాదని డిప్యూటీ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్ కేసుల సంఖ్య 32కు చేరింది. మహారాష్ట్రలోనే అత్యధికంగా 17 కేసులు వచ్చాయి. ఇందులో ఏడు కేసులు ఒక్క శుక్రవారమే బయటపడ్డాయి. ఇందులో ముంబయి నుంచి మూడు, పింప్రీ-చించ్వాడ నుంచి నాలుగు ఉన్నాయి. బాధితుల్లో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. ఒమిక్రాన్‌ సోకిన వారిలో నలుగురికి లక్షణాలు లేవని, ముగ్గురిలో స్వల్ప లక్షణాలు కన్పించినట్లు అధికారులు తెలిపారు. లక్షణాలు లేనివారిని కూడా స్వీయ నిర్బంధంలో ఉంచినట్లు వెల్లడించారు.

డిసెంబరు 1 నుంచి ముంబయి, పుణె, నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టుల ద్వారా 61వేల మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో దాదాపు 10వేల మంది ప్రయాణికులు ఒమిక్రాన్‌ వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చినవారే అని చెప్పారు. వారందరినీ ట్రేస్‌ చేసే పరీక్షలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఐదుగురికి నెగెటివ్​..

పుణెలో ఒమిక్రాన్ సోకిన ఏడుగురిలో ఐదుగురు కోలుకున్నట్లు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. జిల్లాలోని పింప్రి చించ్వాడా ప్రాంతంలో ఉన్న ఆరుగురిలో నలుగురు, పుణె నగరంలో ఓ వ్యక్తికి నెగటివ్​గా తేలింది. 'మొత్తంగా ఏడుగురి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది' అని పవార్ తెలిపారు.

దిల్లీలో రెండో కేసు

దిల్లీలో శనివారం మరో ఒమిక్రాన్​ కేసు బయటపడింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వేల్లో పర్యటించిన 35 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్​ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు ఎల్​ఎన్​జేపీ ఆసుపత్రిలో చేరాడని, కేవలం నీరసం మినహా ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశారు. దీంతో దేశ రాజధాని ప్రాంతంలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 2కు చేరినట్లు తెలిపారు.

గత ఆదివారం దిల్లీలో తొలి కేసు నమోదైంది. డిసెంబర్​ 2న కతార్​ ఎయిర్​వేస్​ విమానంలో టాంజానియా నుంచి వచ్చిన రాంచికి చెందిన 37 ఏళ్ల వ్యక్తికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్​ కేసులు

  • మహారాష్ట్ర- 17
  • రాజస్థాన్​- 9
  • గుజరాత్​- 3
  • కర్ణాటక- 2
  • దిల్లీ- 1

ఇదీ చూడండి: India Covid Cases: 559 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

Last Updated : Dec 11, 2021, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.