'ఓల్డ్ ఈజ్ గోల్డ్'.. ఈ మాటకు ఎంతో విలువ ఉంది. పాత కాలం నాటి వస్తువులకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. కొందరు వాటిని సేకరించడాన్ని హాబీగా పెట్టుకుంటారు. ఇలా పాత తరం టెలిఫోన్లు, రేడీయోకు మంచి ఆదరణ ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో పాత కరెన్సీ నోట్లు, కాయిన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎంతగా అంటే.. మీ దగ్గర పాత కాలం నాటి 10 రూపాయల కాయిన్లు ఉంటే, మీరు లక్షాధికారి అయిపోయినట్టే...
వాటితో లక్షలు..
రూ. 10 కాయిన్ల మీద వైష్ణోదేవీ బొమ్మ ముద్రించి ఉంటే ఇక మీ ఖాతాలో లక్షల రూపాయలు చేరినట్టే! వాటిని వేలానికి పెడితే కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
రూ. 25పైసలు ఉంటే రూ. 1.5 లక్షల వరకు పొందవచ్చు. అయితే అది వెండి రంగులో ఉండాలి.
మీ దగ్గర పాత 5 రూపాయల నోటు ఉంటే మీరు రూ. 30వేల వరకు సంపాదించవచ్చు. అయితే ఆ రూ.5 నోటు మీద ట్రాక్టర్ బొమ్మ కచ్చితంగా ఉండాలి.
1977-1979 మధ్యకాలంలోని రూ. 1 నోటు మీ దగ్గర ఉంటే.. రూ. 45వేలు పొందొచ్చు. అయితే ఆ నోటు మీద నాటి ఆర్థికశాఖలోని మాజీ ప్రధాన కార్యదర్శి హిరూభాయ్ పటేల్ సంతకం ఉండాలి.
కొన్ని వెబ్సైట్లు ఈ ఆఫర్లను ఇస్తూ ఉంటాయి. ఆన్లైన్లో సెర్చ్ చేస్తే అవి సులభంగా దొరుకుతాయి. అయితే ఈ వ్యవహారంలో ఆన్లైన్ మోసాలు కూడా జరిగే అవకాశముంది. అందువల్ల ఆచితూచి అడుగులు వేస్తే.. ఇక కాసుల వర్షమే!
ఇదీ చూడండి:- కుబేరులే కానీ.. ఆదాయపు పన్ను చెల్లించరట!