ETV Bharat / bharat

తుంపర్ల ద్వారానే వైరస్​ వ్యాప్తి అధికం! - droplets

వైరస్​ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా అడ్డుకునేందుకు కీలక మార్గదర్శాకలు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు. వైరస్​ సోకిన వ్యక్తి నుంచి వెలువడే తుంపర్లు, సూక్ష్మబిందువులు ప్రధాన వాహకాలుగా ఉన్నాయన్నారు. మాస్క్​, భౌతిక దూరం వంటి కొవిడ్​ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Virus transmission
వైరస్​ వ్యాప్తి
author img

By

Published : May 20, 2021, 12:53 PM IST

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసి వైరస్​ను కట్టడి చేసేందుకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు. అలాగే.. సార్స్​ కోవ్​2 వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు మాస్కులు, భౌతిక దూరం, శానిటైజేషన్​, వెంటిలేషన్​ చాలా ముఖ్యమని తెలిపారు. సరైన వెంటిలేషన్​ ఉన్న ప్రాంతం వైరస్​ వ్యాప్తిని తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వైరస్​ బారిన పడిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు.

వైరస్​ వ్యాప్తికి తుంపర్లు(ఏరోసోల్​), సూక్ష్మబిందులువులు(డ్రాప్లేట్స్​) ప్రధాన వాహకాలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. గాలిలో తుంపర్లు సుమారు 10 మీటర్ల వరకు, వైరస్​ సోకిన వ్యక్తి నుంచి 2 మీటర్ల వరకు సూక్ష్మ బిందువులు వ్యాపిస్తాయన్నారు. లక్షణాలు లేని వ్యక్తి సైతం వైరస్​ వ్యాప్తికి సరిపడా సూక్ష్మ బిందువులను విడుదల చేస్తారని, దాని ద్వారా చాలా మందికి వైరస్​ సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

Virus transmission
వైరస్​ వ్యాప్తికి ప్రధాన కారణాలు

ఒక వ్యక్తి నుంచి మరొకరికి వైరస్​ సోకే కీలక మార్గాలు..

  • సార్స్​ కోవ్​2 సోకిన వ్యక్తిలో వైరస్​ తన సంఖ్యను పెంచుకుంటుంది. అక్కడి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది.
  • వైరస్​ సోకిన వ్యక్తి లాలాజలం ద్వారా వైరస్​ బయటకు వెలువడుతుంది. అలాగే ఆ వ్యక్తి గాలి పీల్చుకోవటం, మాట్లాడటం, పాటలు పాడటం, నవ్వటం, దగ్గటం వంటివి చేసినప్పుడు ముక్కు, నోటి ద్వారా వైరస్​ బయటకు వస్తుంది.
  • వైరస్​ వ్యాప్తి ఒకరి నుంచి ఒకరికి జరగకుండా చేసేందుకు కొవిడ్​ నిబంధనలు పాటించాలి. దాని ద్వారా వైరస్​ను కట్టడి చేయొచ్చు.
  • వైరస్​ లక్షణాలు లేని వ్యక్తుల మధ్య తిరుగుతున్నప్పుడూ మాస్క్​ ధరించాలి. వైరస్​ సోకిన వ్యక్తిలో రెండు వారాల పాటు లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమయంలో వైరస్​ వ్యాప్తి కొనసాగుతుంది. కొంత మందిలో లక్షణాలు లేకున్నా వైరస్​ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది.

ఇదీ చూడండి: 'అలా శ్వాస తీసుకుంటే.. వైరస్​ ముప్పు అధికం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.