ETV Bharat / bharat

Odisha Train Accident : దిల్లీ నుంచి వైద్యులు, మందులు.. ఎయిర్​ ఫోర్స్​ విమానంలో భువనేశ్వర్​కు.. - odisha train collision

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాద బాధితుల వైద్యం కోసం చర్యలు చేపట్టింది కేంద్రం. దిల్లీ ఎయిమ్స్ సహా ఇతర ఆస్పత్రుల్లోని వైద్యుల బృందాన్ని వాయుసేన ప్రత్యేక విమానంలో భువనేశ్వర్​కు పంపించింది. వీరితో పాటు హెవీ క్రిటికల్ కేర్​ పరికరాలు, మందులను సైతం తరలించింది.

Odisha Train Accident
Odisha Train Accident
author img

By

Published : Jun 4, 2023, 9:59 AM IST

Updated : Jun 4, 2023, 2:01 PM IST

Odisha Train Crash : ఒడిశా రైలు ప్రమాదం మాటలకందని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 275 మంది మరణించగా.. సుమారు 1,100 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో అనేక మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఇప్పుడు వీరికి అందుతున్న వైద్యంపైనే అందరి దృష్టి నెలకొంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దిల్లీ ఎయిమ్స్ సహా ఇతర ఆస్పత్రుల్లోని వైద్యుల బృందాన్ని వాయుసేన ప్రత్యేక విమానంలో భువనేశ్వర్​కు పంపించింది. వీరితో పాటు హెవీ క్రిటికల్ కేర్​ పరికరాలు, మందులను సైతం దిల్లీ నుంచి భువనేశ్వర్​కు తరలించింది.

భువనేశ్వర్​కు ఆరోగ్య మంత్రి
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ క్షతగాత్రులు చికిత్స పొందుతున్న భువనేశ్వర్​ ఎయిమ్స్​, కటక్​ మెడికల్​ కళాశాలను సందర్శించనున్నారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీయనున్నారు. ఇందుకోసం ఆయన భువనేశ్వరక్​ చేరుకున్నారు. క్షతగాత్రులకు వైద్యం అందించడానికి ఎయిమ్స్​ భువనేశ్వర్​కు చెందిన వైద్యుల బృందం ఇప్పటికే బాలేశ్వర్​, కటక్​ ఆస్పత్రులకు వెళ్లినట్లు మాండవీయ శనివారం చెప్పారు.

  • #WATCH | Odisha: Union Health Minister Mansukh Mandaviya reaches Bhubaneswar airport.

    Mansukh Mandaviya will visit AIIMS Bhubaneswar and Medical College in Cuttack to take stock of medical assistance being provided to the injured victims of #OdishaTrainAccident pic.twitter.com/xHKeOOjxFj

    — ANI (@ANI) June 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ముందే అప్రమత్తంగా ఉంటే ఇలా జరిగేది కాదు'
Congress On Odisha Train Accident : రైలు ప్రమాదం జరిగిన తర్వాత అన్ని ఏర్పాట్లు చేశారని ఆరోపించారు రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ అదీర్ రంజన్​ చౌదరి. ఇలాంటి అప్రమత్తత ప్రమాదానికి ముందే ప్రదర్శించి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. కాంగ్రెస్​ తరఫున ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రిని పంపించారు జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.

  • #WATCH | Former MoS Railways and Congress MP Adhir Ranjan Chowdhury reaches the spot in Balasore where the horrific #TrainAccident took place.

    Congress president Mallikarjun Kharge has deputed Adhir Ranjan Chowdhury & AICC In-Charge A Chella Kumar to visit the train crash site… pic.twitter.com/dNp8VUJjbL

100 మృతదేహాలు భువనేశ్వర్​కు తరలింపు
Odisha Train Accident Dead Bodies : మరోవైపు ప్రమాద స్థలం నుంచి 100 మృతదేహాలను ఎయిమ్స్​ భువనేశ్వర్​కు తరలించింది ఒడిశా ప్రభుత్వం. మృతదేహాలను భద్రపరిచి వాటిని కుటుంబసభ్యులకు అప్పగించేందుకే తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 55 మృతదేహాలను గుర్తించి శవపరీక్షల అనంతరం వారి కుటుంబాలకు అందజేసినట్లు చెప్పారు. ఆధారాలు లభించని మృతదేహాలను బహానగా హైస్కూల్, బిజినెస్​ పార్క్ ఆవరణ​లో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్చురీల్లో భద్రపరచినట్లు వివరించారు.

మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు
Odisha Train Accident Ex Gratia : బాలేశ్వర్ రైలు ప్రమాద బాధితులకు పరిహారాన్ని ప్రకటించారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, తీవ్ర గాయాల పాలైన వారికి రూ. లక్ష చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించనున్నట్లు చెప్పారు.

రైలు ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు సంతాపం
ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు బైడెన్​ ఆయన భార్య జిల్ బైడెన్​ సంయుక్తంగా ప్రకటనను విడుదల చేశారు.

ఇవీ చదవండి : వేగంగా ట్రాక్​ పునరుద్ధరణ పనులు.. రాత్రంతా అక్కడే ఉన్న రైల్వే మంత్రి

Odisha Train Accident : 'ఘోర'మాండల్​ రైలు దుర్ఘటన.. ఏ క్షణంలో ఏం జరిగిందంటే?

Last Updated : Jun 4, 2023, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.