Odisha Train Accident Restoration : ఒడిశా బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సహాయ చర్యలు పూర్తికావడం వల్ల ట్రాక్ పునరుద్దరణ పనులను చేపట్టారు అధికారులు. శనివారం రాత్రి నుంచి వెయ్యి మందికిపైగా కార్మికులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. చీకట్లో పనులకు ఇబ్బంది కలగకుండా.. పెద్ద పెద్ద లైట్లను ఏర్పాటు చేశారు. ఏడు ప్రొక్లెయిన్లు, రెండు ఎక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్లు, 3 నుంచి 4 రైల్వే, రోడ్డు క్రేన్లను పునరుద్దరణ పనులకు ఉపయోగిస్తున్నారు.
చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలు, ఇతర చెత్తను.. యంత్రాలతో తొలిగించారు. ట్రాక్ మరమ్మతు పనులు సైతం వేగంగా చేపట్టారు. వీలైనంత త్వరగా ట్రాక్‌ను సిద్ధం చేసి రాకపోకలను పునరుద్ధరిస్తామని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్ఓ ఆదిత్య కుమార్ చౌదరి తెలిపారు. గూడ్స్ బోగిలపైకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిందని తెలిపిన ఆదిత్య కుమార్.. దాని ఇంజిన్‌ను దించేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పవర్ లైన్‌ను కూడా సహాయక బృందాలు పునరుద్ధరణ చేస్తున్నట్లు ఆయన వివరించారు.
-
#WATCH | Odisha: Union Railway Minister Ashwini Vaishnaw inspects the restoration work underway at the site where the deadly #Balasoretrainaccident took place, killing 288 people and injuring 747 pic.twitter.com/wdwLXhUNkO
— ANI (@ANI) June 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Odisha: Union Railway Minister Ashwini Vaishnaw inspects the restoration work underway at the site where the deadly #Balasoretrainaccident took place, killing 288 people and injuring 747 pic.twitter.com/wdwLXhUNkO
— ANI (@ANI) June 3, 2023#WATCH | Odisha: Union Railway Minister Ashwini Vaishnaw inspects the restoration work underway at the site where the deadly #Balasoretrainaccident took place, killing 288 people and injuring 747 pic.twitter.com/wdwLXhUNkO
— ANI (@ANI) June 3, 2023
దగ్గరుండి పునురుద్ధరుణ పనులు పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి..
ఒడిశా రైలు ప్రమాదం స్థలంలో ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాత్రంతా అక్కడే ఉండి అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. వీలైనంతా త్వరగా ట్రాక్ పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. ప్రమాదానికి గురైన రెండు ప్యాసింజర్ రైళ్లకు చెందిన 17 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వారు వెల్లడించారు. మొత్తంగా శుక్రవారం జరిగిన ఈ ఒడిశా రైలు ప్రమాదంలో 275 మంది మృతి చెందారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.
-
#WATCH | Odisha: Restoration work underway at the site of horrific #BalasoreTrainAccident
— ANI (@ANI) June 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Death toll in the incident stands at 288 with 747 people injured along with 56 grievously injured so far. pic.twitter.com/eRkD6TjeO1
">#WATCH | Odisha: Restoration work underway at the site of horrific #BalasoreTrainAccident
— ANI (@ANI) June 3, 2023
Death toll in the incident stands at 288 with 747 people injured along with 56 grievously injured so far. pic.twitter.com/eRkD6TjeO1#WATCH | Odisha: Restoration work underway at the site of horrific #BalasoreTrainAccident
— ANI (@ANI) June 3, 2023
Death toll in the incident stands at 288 with 747 people injured along with 56 grievously injured so far. pic.twitter.com/eRkD6TjeO1
మాటలకు అందని విషాదం నింపిన ఈ ఒడిశా రైలు ప్రమాద ఘటనలో.. అంతకుముందు 18 గంటలు నిర్విరామంగా సహాయక చర్యలు జరిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, త్రివిధ దళాలు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. నుజ్జైన బోగీల నుంచి క్షతగాత్రుల్ని అత్యంత జాగ్రత్తగా వెలికితీసి ఆస్పత్రులకు పంపాయి. మృతదేహాల్ని బయటకు తీశాయి.
-
#WATCH | Odisha: Aerial visuals from ANI’s drone camera show the restoration work underway at the site of #BalasoreTrainAccident
— ANI (@ANI) June 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
As per the Railway Ministry, 1000+ manpower engaged in the work. More than 7 Poclain Machines, 2 Accident Relief Trains, 3-4 Railway and Road Cranes… pic.twitter.com/9vg2wCulyd
">#WATCH | Odisha: Aerial visuals from ANI’s drone camera show the restoration work underway at the site of #BalasoreTrainAccident
— ANI (@ANI) June 4, 2023
As per the Railway Ministry, 1000+ manpower engaged in the work. More than 7 Poclain Machines, 2 Accident Relief Trains, 3-4 Railway and Road Cranes… pic.twitter.com/9vg2wCulyd#WATCH | Odisha: Aerial visuals from ANI’s drone camera show the restoration work underway at the site of #BalasoreTrainAccident
— ANI (@ANI) June 4, 2023
As per the Railway Ministry, 1000+ manpower engaged in the work. More than 7 Poclain Machines, 2 Accident Relief Trains, 3-4 Railway and Road Cranes… pic.twitter.com/9vg2wCulyd
ఘటనపై అధికారులకు సమాచారం ఇచ్చిన ఎన్డీఆర్ఎఫ్ జవాన్
రైలు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి తొందరగా చేరుకోవడానికి.. ఓ ఎన్డీఆర్ఎఫ్ జవాన్ కారణమని తెలిసింది. ఘటన జరిగిన వెంటనే జవాన్ వెంకటేశ్.. తమకు సమాచారమిచ్చారని అధికారులు చెప్పారు. సెలవుపై సొంత రాష్ట్రం తమిళనాడుకు హౌవ్‌డా నుంచి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో వెంకటేష్ బయల్దేరారరు. అదృష్టవశాత్తు జవాన్ ప్రయాణిస్తున్న B-7 బోగీకి ప్రమాదం జరగలేదన్నారు అధికారులు. దీంతో ఆయన ప్రాణాలతో బయటపడి.. వెంటనే తన ఫోన్ నుంచి లైవ్ లొకేషన్‌ను ఎన్డీఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్‌కు పంపిచారన్నారు. సహాయక బృందాలు అక్కడకు వచ్చే లోపు స్థానికులతో కలిసి పలుపురిని రక్షించారు ఎన్డీఆర్ఎఫ్ జవాన్ వెంకటేష్.
-
#WATCH | Odisha: Aerial visuals from ANI’s drone camera show the restoration work that is underway at the site where the deadly #BalasoreTrainAccident took place pic.twitter.com/bjMQIXxQO9
— ANI (@ANI) June 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Odisha: Aerial visuals from ANI’s drone camera show the restoration work that is underway at the site where the deadly #BalasoreTrainAccident took place pic.twitter.com/bjMQIXxQO9
— ANI (@ANI) June 4, 2023#WATCH | Odisha: Aerial visuals from ANI’s drone camera show the restoration work that is underway at the site where the deadly #BalasoreTrainAccident took place pic.twitter.com/bjMQIXxQO9
— ANI (@ANI) June 4, 2023