Odisha Bargarh News: ఒడిశా బార్‌గఢ్ జిల్లాలో విస్మయ ఘటన వెలుగుచూసింది. పాఠశాలకు సెలవులు ప్రకటించాలనే ఉద్దేశంతో ఓ 11వ తరగతి విద్యార్థి మంచినీళ్లలో పురుగు మందు కలిపి తోటి విద్యార్థులతో తాగించాడు. భట్లీ బ్లాక్‌లోని కామ్‌గావ్ ఉన్నత పాఠశాలలో 11, 12వ తరగతులకు చెందిన 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది.. వారందరినీ ఆసుపత్రి తరలించారు.
ఏం జరిగింది?
Pesticides in Bottled Water Odisha: ఓ విద్యార్థి స్వగ్రామం నువాపల్లికి వెళ్లి డిసెంబర్ 6న పాఠశాలకు తిరిగి వచ్చాడు. డిసెంబర్ 19 నుంచి ఒడిశాలో లాక్‌డౌన్ విధిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్‌గా మారింది. దీనిని నిజమని నమ్మిన ఆ విద్యార్థి ఇంటికి వెళ్లొచ్చని సంబరపడ్డాడు. కానీ.. లాక్‌డౌన్ అంటూ ఏమీ లేదని, సెలవులు రావని తెలుసుకుని కలవరం చెందాడు. అయినప్పటికీ పాఠశాలను ఎలాగైనా మూసేసేలా చేస్తానని స్నేహితుల వద్ద చెబుతుండేవాడు.
ఈ క్రమంలో.. డిసెంబర్ 8న అతను హాస్టల్లోని నీళ్ల బాటిళ్లలో పురుగులమందు కలిపాడు. అవి తాగిన అతని స్నేహితులకు ఒంట్లో వికారంగా ఉండటం, కళ్లు తిరగడం సహా.. వాంతులు కూడా అయ్యాయి. సమాచారం అందుకున్న హాస్టల్ సిబ్బంది.. విద్యార్థులను కామ్‌గావ్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.
దీనిపై స్పందించిన పాఠశాల ప్రిన్సిపల్ ప్రేమానంద పటేల్.. 'సెలవులు ఇవ్వడం లేదని, లాక్‌డౌన్ రావడం లేదని' స్పష్టం చేశారు. 1992లో ఏర్పాటైన ఈ ప్రభుత్వ పాఠశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్లో 300 మందికి పైగా విద్యార్థులు ఉంటున్నారు.
ఇవీ చదవండి: