ETV Bharat / bharat

ఆ నిత్యపెళ్లికొడుకు భార్యలు 14 కాదు.. 17 మంది

author img

By

Published : Feb 17, 2022, 12:39 PM IST

Odisha fake doctor marriages: ఒడిశా నిత్యపెళ్లికొడుకు బాధితులు మరో ముగ్గురు బయటపడ్డారు. 14 మందిని వివాహం చేసుకున్న ఆ నిందితుడు.. వీరిని సైతం పెళ్లి చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అతడి ఘనకార్యంపై ముమ్మరంగా విచారణ సాగిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాల కోసం ఆర్​బీఐ నుంచి సహకారం తీసుకుంటున్నారు.

Odisha fake doctor marriages
Odisha fake doctor marriages

Odisha fake doctor marriages: ఏడు రాష్ట్రాలకు చెందిన 14 మంది మహిళల్ని వివాహం చేసుకొని మోసం చేసిన ఒడిశా నిత్యపెళ్లికొడుకు రమేశ్ చంద్ర స్వైన్ పాపాల చిట్టా మరింత పెరిగింది. అతడు వివాహం చేసుకున్న మహిళల సంఖ్య 17కు చేరింది. మరో ముగ్గురు బాధితులను పోలీసులు తాజాగా గుర్తించారు.

Man marries 14 women

ముగ్గురు భార్యలతో పాటు.. ఒడిశాకు చెందిన విద్యార్థిని సైతం తమను ఆశ్రయించిందని భునేశ్వర్ డిప్యూటీ కమిషనర్ యూఎస్ దశ్ తెలిపారు. వైద్యకళాశాలలో సీటు ఇప్పిస్తానని రూ.18 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఆరోపించిందని చెప్పారు. నిందితుడి ఆర్థిక లావాదేవీలు సైతం భారీ స్థాయిలోనే ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. మూడు పాన్​కార్డులు, 11 ఏటీఎం కార్డులను అతడి వద్ద గుర్తించారు. దీంతో పాన్​కార్డుల విషయమై ఆర్​బీఐ నుంచి సహకారం తీసుకుంటున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

Odisha fake doctor 17 wives

ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు(వయసు 60ప్లస్)... 14 వివాహాలు చేసుకున్నట్లు ఇటీవల పోలీసులు వెల్లడించారు. మధ్యవయసులో ఉన్న ఒంటరి మహిళలు, ముఖ్యంగా విడాకులు తీసుకుని భాగస్వామి కోసం చూస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని.. ఇన్ని వివాహాలు చేసుకున్నాడు.

Odisha fake doctor marriages
నిత్యపెళ్లి కొడుకు రమేశ్ చంద్ర స్వైన్ ఇతడే..

ఒడిశా కేంద్రపరా జిల్లా పట్కురా ఠాణా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రమేశ్ చంద్రకు 1982లో తొలిసారి వివాహమైంది. 2002లో రెండో పెళ్లి చేసుకున్నాడు. తొలి రెండు వివాహాలతో అతడికి ఐదుగురు పిల్లలు పుట్టారు. మొదటి భార్యలు ఇద్దరూ ఒడిశా వారే.

2002 నుంచి 2020 వరకు అతడు నిత్యపెళ్లికొడుకుగా చెలరేగిపోయాడు. మాట్రిమోని వెబ్​సైట్​ల ద్వారా మహిళలకు వల వేసేవాడు. తాను వైద్యుడినని చెప్పుకునేవాడు. న్యాయవాదులు, వైద్యులు, బాగా చదువుకున్న ఒంటరి మహిళలకు ఎరవేసేవాడు. పెళ్లి అయ్యాక వారి దగ్గర డబ్బులు తీసుకుని మాయం అయ్యేవాడు. ఇలా దిల్లీ, పంజాబ్, అసోం, ఝార్ఖండ్​, ఒడిశాకు చెందిన వారిని మోసగించాడు ఆ వ్యక్తి. పారా మిలటరీలో పనిచేసే ఓ మహిళ కూడా ఇతడి బాధితురాలేనని తెలిసింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.