ETV Bharat / bharat

గ్రామాలపై ఏనుగుల దండయాత్ర- పలు ఇళ్లు ధ్వంసం

ఒడిశాలోని పలు గ్రామాలపై ఏనుగుల గుంపు దాడి చేసి.. పలు ఇళ్లను ధ్వంసం చేసింది. దీంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఝార్ఖండ్​ అటవీ ప్రాంతం నుంచి మయూర్​భంజ్​ జిల్లాలోకి ఏనుగులు ప్రవేశించినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు.

Elephants attack
ఏనుగుల బీభత్సం
author img

By

Published : Aug 8, 2021, 9:59 AM IST

గ్రామాలపై దాడి చేసిన ఏనుగులు

ఒడిశా మయూర్​భంజ్​ జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని పలు గ్రామాలపై దాడి చేసిన ఓ ఏనుగుల గుంపు.. ఇళ్లను ధ్వంసం చేసింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. తీవ్రంగా శ్రమించి ఏనుగుల గుంపును అడవుల్లోకి పంపించారు.

Elephants attack
ఏనుగుల దాడిలో విరిగిపడిన ఇంటి పైకప్పు
Elephants attack
ధ్వంసమైన ఇళ్లు

ఝార్ఖండ్​ అటవీ పరిధిలోని ఏనుగులు జిల్లాలోకి ప్రవేశించినట్లు వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. అక్రమ మైనింగ్​ కారణంగా ఏనుగులు తమ ఆవాసాలను కోల్పోయి.. జనావాసాల్లోకి వస్తున్నాయని పేర్కొన్నారు.

Elephants attack
అరణ్యంలోకి వెళ్తున్న ఏనుగుల గుంపు

"మయూర్‌భంజ్‌లోని పలు చిన్న గ్రామాల్లోకి ఝార్ఖండ్​ అటవీ ప్రాంతంలోని పలు ఏనుగులు ప్రవేశించి.. రూ.లక్షల విలువైన ఆస్తిని ధ్వంసం చేశాయి. అక్రమ మైనింగ్ కారణంగా అడవులు కనుమరుగవుతున్నాయి. ఫలితంగా ఏనుగులు వాటి సహజ ఆవాసాలను కోల్పోతున్నాయి. దీంతో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా ఇక్కడి ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు."

- వనూమిత్ర ఆచార్య, వన్యప్రాణి పరిశోధకుడు

జూలై 16న 18 ఏనుగులున్న ఓ గుంపు.. మయూర్‌భంజ్‌లోని కరంజియా ప్రాంతంలో ఇళ్లు, భాండాగారాలను ధ్వంసం చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: పిడుగుపాటుకు 24 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.