ETV Bharat / bharat

'మంత్రి రాకతో అసెంబ్లీ అపవిత్రం.. గంగాజలంతో శుద్ధి' - ఒడిశా రాష్ట్ర సహాయ మంత్రి దివ్య శంకర్ మిశ్ర

Ganga jal in assembly: రాష్ట్ర మంత్రి, అధికారపక్ష ఎమ్మెల్యే అడుగుపెట్టడం వల్ల అసెంబ్లీ అపవిత్రమైందని ఆరోపిస్తూ ఒడిశాలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పూజారి వస్త్రధారణలో వచ్చి.. గంగాజలం, గోమూత్రం జల్లి అసెంబ్లీని శుద్ధి చేశారు.

odisha assembly ganga jal
ఒడిశా అసెంబ్లీ గంగాజలం
author img

By

Published : Dec 5, 2021, 1:25 PM IST

ఒడిశా అసెంబ్లీ

Ganga jal in assembly: ఒడిశా అసెంబ్లీలో శనివారం ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. స్వయంగా ఓ కాంగ్రెస్ సీనియర్​ నేత, శాసనసభ్యుడు.. పూజారి వస్త్రధారణలో వచ్చి అసెంబ్లీలో గంగా జలం, గోమూత్రం జల్లారు.

Odisha assembly bahinipati: ఉపాధ్యాయురాలు మమిత మెహర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన గోవింద సాహుతో రాష్ట్ర సహాయ మంత్రి, అధికారపక్ష ఎమ్మెల్యే దివ్య శంకర్ మిశ్రకు సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినీపతి ఆరోపించారు. దివ్య శంకర్ అడుగు పెట్టడం వల్ల ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ అపవిత్రమైపోయిందని చెప్పారు. అందుకే తాను ఇలా గంగాజలంతో అసెంబ్లీని శుద్ధి చేశానని ఆయన పేర్కొన్నారు.

odisha assembly ganga jal
అసెంబ్లీని శుద్ధి చేస్తున్న కాంగ్రెస్ నేత బాహినీపతి
odisha assembly ganga jal
గంగాజలం జల్లుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

"మంత్రి దివ్య శంకర్ మిశ్ర ప్రజాస్వామ్య దేవాలయంలో అడుగు పెట్టి అపవిత్రం చేశారు. అందుకే నేను గంగాజలం, గోమూత్రం, తులసీ ఆకులతో అసెంబ్లీని శుద్ధి చేశాను."

-తారాప్రసాద్ బాహినీపతి, కాంగ్రెస్ ఎమ్మెల్యే

కలహండి జిల్లా మహాలింగ్​లోని సన్​షైన్ ఇంగ్లీష్​ మీడియం స్కూల్​కు చెందిన మమిత మెహర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా గోవింద సాహు ఉన్నారు.

odisha assembly cow urine
ఔడిశా అసెంబ్లీ కాంగ్రెస్​ నిరసన
odisha assembly cow urine
ఒడిశా అసెంబ్లీలో గందరగోళం

ఖండించిన బిజద..

దివ్య శంకర్ మిశ్రపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను అధికార బిజు జనతా దళ్​(బిజద) ఖండించింది. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరగాలని సీఎం చెప్పినప్పటికీ.. అసెంబ్లీలో ప్రతిపక్షం ఇలాంటి అనవర నాటకాలు చేస్తోందని మండిపడింది.

ఇదీ చూడండి: Nitish Kumar: మహిళా ఎమ్మెల్యేపై సీఎం అనుచిత వ్యాఖ్యలు!

ఇదీ చూడండి: యూపీఏతో కాదు.. కొత్త ఫ్రంట్‌ వైపు ఎస్పీ చూపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.