ఒడిశాలోని మల్కాన్‌గిరిలో 100 మంది గ్రామీణులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని కుర్తీ గ్రామంలోని పడియో బ్లాక్‌లో ఈ సంఘటన జరిగింది. ఓ కార్యక్రమంలో వారంతా లస్సీ తాగిన క్రమంలో అనారోగ్యంపాలైనట్లు అధికారులు తెలిపారు.
వీరిలో 20 మంది ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో చాలా మంది చిన్నపిల్లులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై జిల్లా ఆరోగ్యాధికారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాన్‌గిరి కలెక్టర్ తెలిపారు.
ఇదీ చూడండి: టీకా తీసుకుంటే.. 94% ఆసుపత్రి ముప్పు తప్పినట్లే!