ETV Bharat / bharat

ఒడిశా మఠంలో 45 వెండి ఇటుకలు లభ్యం! - పూరీ జిల్లాలోని ఎమర్ మఠ్​

ఒడిశాలో భారీ ఎత్తున వెండి ఇటుకలు బయటపడ్డాయి. పూరీ జిల్లాలోని ఓ మఠం నిర్వహణ బాధ్యతలను శనివారం కొత్త ట్రస్ట్​కు అప్పగించే సందర్భంలో.. ఓ గదిలో దాచిన నాలుగు పెట్టెల్లో 45 ఇటుకలు వెలుగుచూశాయి. ఒక్కో ఇటుక బరువు సుమారు 30 కిలోలకుపైగా ఉంటుందని అధికారులు చెప్పారు.

Odisha: 45 silver bricks recovered from Emar Mutt
ఒడిశాలోని ఓ మఠంలో 45 వెండి ఇటుకలు లభ్యం!
author img

By

Published : Apr 11, 2021, 3:11 PM IST

ఒడిశాలోని ఓ​ మఠంలో సుమారు 45వెండి ఇటుకలు బయటపడ్డాయి. ఎండోమెంట్​ విభాగం.. మఠం నిర్వహణ బాధ్యతలు, ఆస్తులను వేరొక ట్రస్ట్​కు అప్పగించే క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కో ఇటుక బరువు సుమారు 30కిలోలకుపైగా ఉంటుందని అధికారులు చెప్పారు.

Odisha: 45 silver bricks recovered from Emar Mutt
మఠం ఆస్తుల్ని కొత్త ట్రస్ట్​కు అప్పగిస్తున్న ఎండోమెంట్​ విభాగం

వెండి ఇటుకలు భద్రపరిచిన పెట్టెలు

పూరీ జిల్లాలోని ప్రసిద్ధ ఎమర్​ మఠ్​ నిర్వహణ బాధ్యతలను.. ఎండోమెంట్​ కమిషనర్​.. కొత్త ట్రస్ట్​కు మార్చారు. ఈ క్రమంలో ఆ మఠానికి చెందిన ఆస్తులను ట్రస్ట్​కు అప్పగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మఠంలోని ఓ గదిలో ఉంచిన నాలుగు పెట్టెల్లోని వెండి ఇటుకలు బయటపడ్డాయి. ఒక్కో ఇటుక సమారు 30కిలోల కంటే అధిక బరువుంటుందని చెప్పిన అధికారులు.. తూనికలు, కొలతల ప్రక్రియ పూర్తయ్యాక కొత్త ట్రస్ట్​కు అప్పగిస్తామన్నారు.

మఠానికి చెందిన ఆయుధ సామగ్రి

నాడు 522 వెండి ఇటుకలు..

2010లో ఎండోమెంట్​ విభాగం.. ఈ మఠానికి సంబంధించిన ఆస్తులను లెక్కించి.. ఆ జాబితాలో 45వెండి ఇటుకలను చేర్చింది. 2011లో అక్కడ సోదాలు నిర్వహించగా.. లెక్కల్లోలేని 522వెండి ఇటుకలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే.. మఠానికి సరైన భద్రత లేని కారణంగా.. వాటిని నేలలో పూడ్చారని.. మఠానికి చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ఎండోమెంట్​ విభాగం చొరవతో వాటిని తిరిగి అప్పగించామన్నారు.

ఇదీ చదవండి: మురికివాడలో భారీ అగ్నిప్రమాదం- గుడిసెలు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.