ETV Bharat / bharat

'లావెక్కుతున్న భారతం.. ఆ రాష్ట్రాల్లో సమస్య తీవ్రం!'

author img

By

Published : Nov 28, 2021, 2:43 PM IST

Obesity in India: జన భారతం లావెక్కుతోంది. చిన్నాపెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా ఊబకాయులు(Obesity rising among children) పెరిగిపోతున్నారు. దేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధిక బరువు ఉన్నవారి సంఖ్య పెరిగినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. సర్వేలోని మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Obesity rising among children
ఊబకాయులు

Obesity in India: దేశంలో ఊబకాయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఐదేళ్లలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని(Obesity rising among children) వెల్లడించింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్​ఎఫ్​హెచ్​ఎస్​). 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వయసుకు మించి బరువు ఉన్న చిన్నారుల సంఖ్యలో పెరుగుదల నమోదైనట్లు తెలిపింది. దీనికి ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవటం, సరైన ఆహార నియమాలు పాటించకపోవటమేనని చెబుతున్నారు నిపుణులు.

  • కుటుంబ ఆరోగ్య సర్వే-4(2015-16)తో పోలిస్తే ఐదో సర్వేలో అధిక బరువు ఉన్న చిన్నారులు 2.1 శాతం నుంచి 3.4 శాతానికి చేరుకున్నారు. కేవలం చిన్నారుల్లోనే కాదు, మహిళలు, పురుషుల్లోనూ ఊబకాయం(obesity among adults) పెరిగిపోతోందని సర్వే వెల్లడించింది. ఆ సంఖ్య మహిళల్లో 20.6 శాతం నుంచి 24 శాతానికి, మగవారిలో 18.9శాతం నుంచి 22.9 శాతానికి చేరింది.
  • తాజా సర్వే ప్రకారం మహారాష్ట్ర, గుజరాత్​, త్రిపుర, లక్షాద్వీప్​, జమ్ముకశ్మీర్​, ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీ, బంగాల్​, ఆంధ్రప్రదేశ్​, లద్దాఖ్​లో ఐదేళ్లలోపు పిల్లల్లో అధిక బరువు ఉన్నవారి సంఖ్య పెరిగింది.
  • గోవా, తమిళనాడు, దాద్రానగర్​ హవేలీ, దామన్ దియూలలో మాత్రమే ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఊబకాయుల సంఖ్యలో తగ్గుదల నమోదైంది.
  • 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. మహిళల్లో స్థూలకాయులు(obesity news) పెరిగారు. 33 రాష్ట్రాలు, యూటీల్లో పురుషుల్లో ఊబకాయుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది.
  • పురుషులు, మహిళల్లో శరీర బరువు 25కేజీ/ఎం2 కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉన్నప్పుడు ఊబకాయంగా పరిగణిస్తారు. అలాగే.. చిన్నారుల్లో ఎత్తుకు తగిన బరువును పరిశీలిస్తారు.

నిపుణుల హెచ్చరిక..

చిన్నారులు సహా పెద్దవారిలోనూ ఊబకాయులు(obesity among adults) పెరిగిపోయేందుకు శారీరక శ్రమ తగ్గిపోవటం, ఆహార పద్ధతులే కారణమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణలు.

" గత 15 ఏళ్లుగా స్థిరమైన ఆర్థిక వృద్ధి కారణంగా ప్రజలు ఆదాయాలు పెరిగాయి. ఆర్థికంగా ఎదగటమే భారతీయుల్లో ఊబకాయం పెరగటానికి కారణమని మనందరికీ తెలుసు. ఎన్​ఎఫ్​హెచ్​ఎస్​-4 ప్రకారం అల్పాదాయ వర్గాల్లోని పురుషుల్లో స్థూలకాయులు 5 శాతం, మహిళలు 6శాతం ఉంటే, అధికాదాయ వర్గాల్లో పురుషులు 33 శాతం, మహిళలు 36శాతం ఉన్నారు. అయినప్పటికీ, ఆదాయం పెరగటం కారణంగా చూపటం సరికాదు. ఆహార అలవాట్లు సరిగా లేకపోవటం ప్రధాన సమస్యగా మారుతోంది. జంక్​ ఫుడ్స్​ వంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల బరువు పెరిగిపోతుంది. "

- పూనమ్​ ముట్టరేజా, పాపులేషన్​ ఫౌండేషన్ ఆఫ్​ ఇండియా ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​.

ఇదీ చూడండి: Obesity in children: 'కరోనా వేళ చిన్నారుల్లో పెరిగిన ఊబకాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.