ETV Bharat / bharat

Nursing Student Killed : ప్రేమను నిరాకరించిందని దాడి.. చికిత్స పొందుతూ యువతి మృతి.. ఆపై నిందితుడు ఆత్మహత్య - young women murder in kerala

Nursing Student Killed for Rejecting Love : యువతిపై కొడవలితో దాడి చేశాడు ఓ యువకుడు. ప్రేమను నిరాకరించిందని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఎనిమిది రోజుల చికిత్స అనంతరం బాధితురాలు మృతి చెందింది. కేరళలో ఈ ఘటన జరిగింది.

nursing-student-killed-for-rejecting-love-proposal-in-kerala-by-friend
కేరళలో నర్సింగ్ విద్యార్థిని కత్తితో పొడిచి హత్య
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 11:02 AM IST

Nursing Student Killed for Rejecting Love : ప్రేమను నిరాకరించిందని యువతిపై కొడవలితో దాడి చేశాడు ఓ యువకుడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి.. చికిత్స పొందుతూ మృతి చెందింది. దాడి అనంతరం నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సెప్టెంబర్​ 5న ఈ ఘటన జరగ్గా.. ఎనిమిది రోజుల చికిత్స అనంతరం బాధితురాలు మృతి చెందింది. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు అల్కా(19).. నర్సింగ్​ విద్యార్థిని. పెరుంబవూరు పరిధిలోని రాయమంగళం ప్రాంతానికి చెందిన యువతి. నిందితుడు బాసిల్(21)​.. ఇరింగోల్​ నివాసి.​ వీరిద్దరు మొదట స్నేహితులుగానే ఉండేవారు. కానీ గత కొంతకాలంగా అల్కాను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు బాసిల్. తరచుగా ఆమె వెంటపడుతూ ప్రేమించమని ఇబ్బంది పెడుతుండేవాడు. దీంతో అతడి ప్రేమను తిరిస్కరించి.. బాసిల్​ను దూరం పెట్టింది అల్కా. ఫోన్​ నంబర్​ కూడా మార్చుకుంది.

దీంతో అల్కాపై కోపం పెంచుకున్న బాసిల్​.. యువతి తల్లిదండ్రులు లేని సమయం చూసి ఆమె ఇంటికి వెళ్లాడు. కొడవలితో అల్కాను పలు మార్లు పొడిచాడు. అడ్డొచ్చిన యువతి నాన్నమ్మ, తాతయ్యపై కూడా దాడి చేశాడు. బాధితుల కేకలు విన్న ఇంటిపక్కల వాళ్లు వెంటనే అక్కడికి వచ్చారు. దీంతో ఘటనా స్థలం నుంచి బాసిల్ పారిపోయాడు​. ఆలస్యం చేయకుండా అల్కాను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మొదట పెరుంబవూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలిక పరిస్థితి విషమించడం వల్ల ఎర్నాకులం మెడికల్​ కాలేజ్​కు తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. యువతి నాన్నమ్మ, తాతయ్యలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. తలకు తీవ్రంగా గాయాలు కావడం వల్లే యువతి చనిపోయిందని వారు వెల్లడించారు.

ఆత్మహత్య చేసుకున్న నిందితుడు..
యువతిపై దాడి చేసిన అనంతరం నిందితుడు బాసిల్​ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. యువతిపై దాడి ఘటనపై కేసు నమోదు చేసుకుని.. విచారణ కోసం బాసిల్​ ఇంటికి వెళ్లిన పోలీసులకు శవమై కనిపించాడు నిందితుడు.

Liquor Mafia Attack on Police : పోలీస్​ కన్ను పీకేసిన లిక్కర్​ మాఫియా​.. దందాకు అడ్డువస్తున్నాడని..

డబ్బులివ్వలేదని దారుణం.. యువకుడి జననాంగంపై కత్తితో దాడి.. డ్యూటీ నుంచి వెళ్తుండగా..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.