Nurse Brain Dead Karnataka: కర్ణాటక చిక్కమగళూరులో విషాదం జరిగింది. ఓ నర్సు బ్రెయిన్‌డెడ్ అయి మృతిచెందగా.. ఆమె అవయవాలను దానం చేశారు కుటుంబసభ్యులు. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్ చేశారు.
రోజూలాగే ఆస్పత్రికి..
నరసింహరాజపుర మండలం, మక్కిమనే గ్రామానికి చెందిన టీకే గన్వీ గౌడ(22). శివమొగ్గలోని ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. రోగులకు చికిత్స అందిస్తూనే కుప్పకూలిపోయారు. డాక్టర్లు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధరించారు. దీంతో ఆమె అవయవాలను ఇతరుల కోసం దానం చేశారు కుటుంబసభ్యులు. ఈ ఘటనపై కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ ట్వీట్ చేశారు.
" ఇతరులకోసం జీవించేవారు.. ఒంటరిగా జీవిస్తారు." అని పేర్కొన్నారు.
తెల్లారితే పెళ్లి అనగా..
వివాహానికి గంటల వ్యవధి ఉందనగా.. కర్ణాటకకు చెందిన చైత్ర అనే వధువు స్పృహ తప్పి పడిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్తే బ్రెయిన్ డెడ్ అయిందని తేలింది. ఈ బాధలోనూ బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు ఆమె తల్లిదండ్రులు. యువతి అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇదీ చూడండి: పెళ్లితో ఒక్కటైన ట్రాన్స్జెండర్ల జంట- ఇలా దేశంలోనే తొలిసారి!