Bulldozer Action In Haryana : అల్లర్లతో ఇటీవల రణరంగంగా మారిన హరియాణాలోని నూహ్ జిల్లాలో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా మూడో రోజు బుల్డోజర్లతో అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు అధికారులు. శుక్రవారం కూడా తావ్‌డూ పట్టణంలో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న 250 గుడిసెలను అధికారులు తొలగించారు. తాజాగా శనివారం ఉదయం సైతం నల్హార్ ప్రాంతంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను పంపించారు అధికారులు.
ఆసుపత్రి వద్ద ఉన్న మెడికల్ షాపులు, ఇతర దుకాణాలను కూల్చివేశారు అధికారులు. దీంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ అక్రమ కట్టడాలను కూడా నేలమట్టం చేస్తున్నారు. శనివారం ఒక్కరోజే 50 నుంచి 60 నిర్మాణాలను పడగొట్టినట్లు అధికారులు వివరించారు. అరెస్టులు చేస్తారని భయంతో ఈ దుకాణాదారులు అక్కడి నుంచి పారిపోయినట్లు వారు వెల్లిడించారు.
-
#नूंह में ये महज ग़रीबों के मकान ही नहीं ढहाए जा रहे बल्कि आम जन के विश्वास, भरोसे को गिराया जा रहा है। ग्रामीणों ने बताया कि आज महीने पुरानी बैक डेट में नोटिस देकर आज ही मकान दुकान गिरा दिये।
— Ch Aftab Ahmed MLA (@Aftabnuh) August 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
सरकार प्रशासनिक विफलताओं को छुपाने के लिए गलत कारवाई कर रही है, ये दमनकारी नीति है। pic.twitter.com/U7DOLisTUN
">#नूंह में ये महज ग़रीबों के मकान ही नहीं ढहाए जा रहे बल्कि आम जन के विश्वास, भरोसे को गिराया जा रहा है। ग्रामीणों ने बताया कि आज महीने पुरानी बैक डेट में नोटिस देकर आज ही मकान दुकान गिरा दिये।
— Ch Aftab Ahmed MLA (@Aftabnuh) August 4, 2023
सरकार प्रशासनिक विफलताओं को छुपाने के लिए गलत कारवाई कर रही है, ये दमनकारी नीति है। pic.twitter.com/U7DOLisTUN#नूंह में ये महज ग़रीबों के मकान ही नहीं ढहाए जा रहे बल्कि आम जन के विश्वास, भरोसे को गिराया जा रहा है। ग्रामीणों ने बताया कि आज महीने पुरानी बैक डेट में नोटिस देकर आज ही मकान दुकान गिरा दिये।
— Ch Aftab Ahmed MLA (@Aftabnuh) August 4, 2023
सरकार प्रशासनिक विफलताओं को छुपाने के लिए गलत कारवाई कर रही है, ये दमनकारी नीति है। pic.twitter.com/U7DOLisTUN
నూహ్‌లో 250 గుడిసెల కూల్చివేత..
నూహ్‌లో ఇటీవల జరిగిన అల్లర్లు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టడం పలు అనుమానాలు తావిస్తోంది. అల్లర్లకు పాల్పడ్డ నిందితులను సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారని.. వారి అక్రమ నిర్మాణాలనే అధికారులు ఇప్పుడు నేలమట్టం చేశారనే వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలను పోలీసులు ఖండించారు. ఇవన్నీ అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలనేనని, వాటిని తొలగించేందుకు ఇదివరకే నోటీసులు ఇచ్చినట్లు వారు చెబుతున్నారు. అల్లర్లకు ఈ కూల్చివేతలకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు పేర్కొన్నారు.
-
#WATCH | Haryana administration demolishes illegal constructions near SKM Government Medical College in Nuh district pic.twitter.com/r2htjmGpyh
— ANI (@ANI) August 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Haryana administration demolishes illegal constructions near SKM Government Medical College in Nuh district pic.twitter.com/r2htjmGpyh
— ANI (@ANI) August 5, 2023#WATCH | Haryana administration demolishes illegal constructions near SKM Government Medical College in Nuh district pic.twitter.com/r2htjmGpyh
— ANI (@ANI) August 5, 2023
సీఎం ఆదేశాలతోనే కూల్చివేతలు..!
అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదేశాలతో ఈ కూల్చివేతలు జరుగుతున్నట్లు సమాచారం. అల్లర్లలో పాల్గొన్న వారి అక్రమ కట్టడాలనే తొలగిస్తున్నామని అధికారులు ధ్రువీకరించినట్లు కొన్ని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే అధికారులు ఈ కూల్చివేతలకు పాల్పడినట్లు తెలిపాయి.
కొండలపై నుంచి కాల్పులు..
నూహ్ అల్లర్లు ముందస్తు కుట్రలో భాగమేనని హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ ఆరోపించారు. ఈ విధ్వంసంలో పాల్గొన్న నిందితులు కొండలపై నుంచి కాల్పులు జరిపారని వెల్లడించారు. కొన్ని భవనాల టెర్రస్‌లపైన రాళ్లను కూడా గుర్తించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇదంతా చూస్తుంటే భారీ ప్రణాళిక ప్రకారమే ఈ హింస రూపుదిద్దుకున్నట్లు అనిపిస్తోందని అనిల్ విజ్ ఆరోపించారు. కొన్ని గంటల తర్వాతే ఘర్షణల గురించి తనకు తెలిసిందని మంత్రి చెప్పడం గమనార్హం. ఘటనపై ప్రభుత్వ అధికారులు, పోలీసులు తనకు సమాచారం ఇవ్వలేదని.. ఓ ప్రైవేటు వ్యక్తి తనకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ అల్లర్లపై 102 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసి.. దాదాపు 200 మందిని అరెస్టు చేశారు పోలీసులు. మరో 80 మంది దాకా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గురుగ్రామ్‌కు వ్యాపించిన అల్లర్లు.. ప్రార్థనామందిరంపై కాల్పులు.. ఐదుగురు మృతి!
'నిరసనల్లో విద్వేష ప్రసంగాలు జరగకుండా చూడండి'.. హరియాణా హింసపై కేంద్రానికి సుప్రీం ఆదేశం