ETV Bharat / bharat

NTPCలో జాబ్స్​.. నెలకు రూ.2.80లక్షలు జీతం!.. ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్​

author img

By

Published : Jun 1, 2023, 4:57 PM IST

NTPC Recruitment 2023 : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్​టీపీసీ)లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఆయా పోస్టుల‌ను బట్టి ఆకర్ష‌ణీయ‌మైన వేత‌నం ఉంది. ఉద్యోగం, విద్యార్హ‌త‌, క‌నీస వ‌య‌సు, జీతం త‌దిత‌ర వివరాలను తెలుసుకుందాం.

NTPC RECRUITMENT 2023
NTPC RECRUITMENT 2023

NTPC Recruitment 2023 : ప్రముఖ విద్యుత్​ ఉత్ప‌త్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్​టీపీసీ)లో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టులు భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఎన్​టీపీసీ అధికారిక వెబ్​సైట్ https://www.ntpc.co.in లోకి వెళ్లి ఆన్​లైన్​లో ద‌రఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవాడానికి చివరి తేదీ జూన్ 9. ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

NTPC Recruitment Notification : మొత్తం 11 పోస్టులకు ఎన్​టీపీసీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. అడిష‌న‌ల్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్‌, ఇంజినీర్ పోస్టులున్నాయి. క‌నీస వ‌య‌సు 30 నుంచి 52 ఏళ్ల వ‌ర‌కు ఉంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు వేత‌నం.. పోస్టును బ‌ట్టి నెల‌కు రూ.50 వేల నుంచి రూ.2.80 ల‌క్ష‌లు ఉంటుంది. జ‌న‌ర‌ల్‌, ఈడ‌బ్ల్యూఎస్, ఓబీసీ అభ్య‌ర్థులకు ఫీజు రూ.300 ఉంది. ఎస్​సీ, ఎస్​టీ, ఎక్స్ స‌ర్వీస్ మెన్, దివ్యాంగులు, మ‌హిళ‌లు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. పోస్టును బ‌ట్టి సంబంధిత విభాగాల్లో అనుభ‌వం 3 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వ‌ర‌కు ఉండాలి.

పోస్టులను బ‌ట్టి విద్యార్హ‌త‌లు, వ‌య‌సు, జీతం ఇలా ఉన్నాయి.

  • అడిష‌న‌ల్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ - గుర్తింపు పొందిన క‌ళాశాల లేదా యూనివ‌ర్సిటీ నుంచి కెమిక‌ల్ ఇంజినీరింగ్ డిగ్రీ క‌లిగి, క‌నీసం 60 శాతం మార్కుల‌తో పాసై ఉండాలి. 52 సంవ‌త్స‌రాల వయసు లోపు వారే ఈ పోస్ట్​కు అర్హులు. జీతం నెల‌కు రూ.1.20 ల‌క్ష‌లు - 2.80 ల‌క్ష‌లు ఉంటుంది.
  • డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ - కెమిక‌ల్/ మెకానిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్​లో డిగ్రీ పూర్తి చేసి క‌నీసం 60 శాతం మార్కుల‌తో పాసై ఉండాలి. వ‌యో పరిమితి 47 సంవ‌త్స‌రాల వరకు ఉంది. జీతం నెల‌కు రూ.1 ల‌క్ష - రూ.2.60 ల‌క్ష‌లు ఉంటుంది.
  • సీనియ‌ర్ మేనేజ‌ర్ - గుర్తింపు పొందిన క‌ళాశాల లేదా యూనివ‌ర్సిటీ నుంచి కెమిక‌ల్ ఇంజినీరింగ్ డిగ్రీ క‌లిగి ఉండాలి. క‌నీసం 60 శాతం మార్కుల‌తో పాసై ఉండాలి. గరిష్ఠ వ‌య‌సు 44 ఏళ్లు. జీతం నెల‌కు రూ.90 వేల నుంచి రూ. 2.40 ల‌క్ష‌లు ఉంటుంది.
  • అసిస్టెంట్ మేనేజ‌ర్ - ఇంజినీరింగ్​లో కెమిక‌ల్ / ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్/ ఇన్​స్ట్రుమెంటేష‌న్‌/ సివిల్/ ఎన్విరాన్​మెంట్ విభాగాల్లో క‌నీసం 60 శాతం మార్కుల‌తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు ఇండ‌స్ట్రీయ‌ల్ ఫైర్‌సేఫ్టీలో డిప్లమా చేసి ఉండాలి. 35 సంవత్స‌రాల వయసు లోపు వాళ్లే దరఖాస్తు చేసుకోవాలి. జీతం నెల‌కు రూ.60 వేల నుంచి రూ.1.80 ల‌క్ష‌లు ఉంటుంది.
  • ఇంజినీర్ - కెమిక‌ల్ ఇంజినీరింగ్​లో క‌నీసం 60 శాతం మార్కుల‌తో పాసై ఉండాలి. 30 ఏళ్ల వయసు లోపు యువకులే ఈ పోస్ట్​కు అర్హులు. జీతం నెల‌కు రూ.50 వేల నుంచి రూ.1.60 ల‌క్ష‌లు ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.