NTPC Jobs Notification : అసోం రాష్ట్రం బొంగైగావ్‌లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్-ఎన్‌టీపీసీ ( NTPC Jobs 2023 )లో ఖాళీగా ఉన్న మొత్తం 50 డిప్లొమా ట్రైనీ, ఆర్టిజన్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు..
NTPC Job Vacancy : 50 పోస్టులు.
పోస్టుల వివరాలు..
- అసిస్టెంట్ మెటీరియల్, స్టోర్ కీపర్: 5 పోస్టులు
- డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్, మెకానికల్, సి అండ్ ఐ, సివిల్) - 18 ఖాళీలు
- ఆర్టిజన్ ట్రైనీ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) - 27 పోస్టులు
ఏజ్ లిమిట్..
38 సంవత్సరాలు మించకూడదు.
విద్యార్హతలు..
సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
జీతభత్యాలు..
ప్రతినెలా రూ.21,500-రూ.24,000 వరకు వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు..
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు- రూ.300/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ సహా మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రసుము లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ..
దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్ 15
వెబ్సైట్..
NTPC Website : నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్సైట్ https://www.ntpc.co.in/ను చూడవచ్చు.
కర్ణాటకలోని నిట్‌లో 112 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
NITK Non-Teaching Jobs 2023 :
NITK Jobs 2023 : కర్ణాటకలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 112 రెగ్యులర్ పోస్టుల( Jobs In NIT Karnataka ) భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 6 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు..
NITK Recruitment 2023 : 112 పోస్టులు.
ఈ పోస్టులు..
- సూపరింటెండెంట్- 04 పోస్టులు
- సీనియర్ అసిస్టెంట్- 11 పోస్టులు
- సీనియర్ టెక్నీషియన్- 18 ఖాళీలు
- ఆఫీస్ అటెండెంట్- 21 ఖాళీలు
- జూనియర్ అసిస్టెంట్- 23 పోస్టులు
- టెక్నీషియన్- 35 ఖాళీలు
అర్హతలు..
ఆయా పోస్టులను అనుసరించి 10+2, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు రుసుము..
- అన్రిజర్వ్డ్, ఓబీసీలకు- రూ.1000/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు- రూ.500/-
ఎంపిక విధానం..
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ : 2023 సెప్టెంబర్ 6
వెబ్సైట్..
NITK Website : గరిష్ఠ వయోపరిమితులు, జీతభత్యాలు తదితర వివరాలు కోసం NITK అధికారిక వెబ్సైట్ http://www.nkinstitute.in/ను వీక్షించవచ్చు.