ETV Bharat / bharat

NTPC Engineering Jobs 2023 : గేట్ స్కోర్​తో.. 495 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ జాబ్స్​.. అప్లై చేసుకోండిలా!

NTPC Engineering Jobs 2023 In Telugu : ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ఎన్​టీపీసీ లిమిటెడ్​ 495 ఇంజినీరింగ్​ ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్​ 2023 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలు మీ కోసం..

NTPC Recruitment 2023
NTPC Engineering Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 10:25 AM IST

NTPC Engineering Jobs 2023 : నేషనల్​ థర్మల్ పవర్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ (NTPC) 495 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్​ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం ప్రకటన చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు careers.ntpc.co.in వెబ్​సైట్​లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • ఎలక్ట్రికల్ - 120 పోస్టులు
  • మెకానికల్​ - 200 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్​/ ఇన్​స్ట్రుమెంటేషన్ - 80 పోస్టులు
  • సివిల్ - 30 పోస్టులు
  • మైనింగ్ - 65 పోస్టులు

విద్యార్హతలు
NTPC Engineering Job Qualification : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా.. ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి కనీసం 65 శాతం మార్కులతో బ్యాచులర్​ డిగ్రీ (ఇంజినీరింగ్​/ టెక్నాలజీ) పూర్తి చేసి ఉండాలి. అలాగే గ్రాడ్యుయేట్​ ఆప్టిట్యూడ్​ టెస్ట్ ఇన్​ ఇంజినీరింగ్ (GATE​ 2023)లోనూ క్వాలిఫై అయ్యుండాలి.

వయోపరిమితి
NTPC Engineering Job Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 అక్టోబర్​ 20 నాటికి 27 ఏళ్లు లోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్​ ఉంటుంది.

దరఖాస్తు రుసుము
NTPC Engineering Job Fee :

  • జనరల్​, ఈడబ్ల్యూఎస్​, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు.. పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • అప్లికేషన్ ఫీజును ఆన్​లైన్​, ఆఫ్​లైన్ రెండు విధాలుగానూ చెల్లించేందుకు అవకాశం ఉంది.

ఎంపిక ప్రక్రియ
NTPC Engineering Job Selection Process : అభ్యర్థులు కచ్చితంగా గేట్​ 2023లో క్వాలిఫై అయ్యుండాలి. వాస్తవానికి ఈ గేట్​లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను షార్ట్​ లిస్ట్ చేస్తారు. తరువాత డాక్యుమెంట్స్​ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్​​ చేసి.. ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీత భత్యాలు
NTPC Salary : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు జీతం అందిస్తారు.

దరఖాస్తు చేసుకోండిలా!
NTPC Online Application Process :

  • ముందుగా ఎన్​టీపీసీ అధికారిక వెబ్​సైట్​ www.ntpc.co.in ను ఓపెన్ చేయాలి.
  • గేట్​ 2023 రిజిస్ట్రేషన్ నంబర్​ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఇందుకోసం ముందుగా దరఖాస్తులో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి. తరువాత ఒకసారి అన్ని వివరాలు చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలి.
  • అప్లికేషన్ సబ్మిట్​ చేసిన తరువాత ఒక యూనిక్​ నంబర్ జనరేట్ అవుతుంది. దానిని జాగ్రత్తగా ఒక దగ్గర నోట్ చేసుకోవాలి.
  • తరువాత దరఖాస్తు రుసుమును ఆన్​లైన్​ లేదా ఆఫ్​లైన్​లో చెల్లించాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్​ను తీసుకుని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
NTPC Recruitment Application Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 అక్టోబర్​ 6
  • దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ : 2023 అక్టోబర్ 20

GRSE Apprentice Jobs 2023 : ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. GRSEలో అప్రెంటీస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!

BEL Engineering Jobs 2023 : బీఈ, బీటెక్​ అర్హతతో.. BELలో ప్రొబేషనరీ ఇంజినీర్​, ఆఫీసర్​​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.