ETV Bharat / bharat

కరోనా రోగుల కోసం 48 గంటల్లో రూ.కోటి సేకరణ - ఎన్నారై జంట

తమిళనాడుకు చెందిన ఎన్నారై దంపతులు 48 గంటల్లో రూ.కోటి విరాళంగా సేకరించారు. ఆ డబ్బును కరోనా రోగుల చికిత్స కోసం కోయంబత్తూరులోని ఆసుపత్రులకు ఇచ్చారు.

NRI
ఎన్నారై
author img

By

Published : May 23, 2021, 3:35 PM IST

కరోనా రోగుల కోసం 48 గంటల్లో ఓ ఎన్నారై జంట రూ. కోటి విరాళం రూపంలో సేకరించింది. ఆ డబ్బును ఆసుపత్రులకు ఇచ్చారు రాజేశ్​ రంగస్వామి- నిత్యా మోహన్.

NRI
ఆక్సిజన్ సిలిండర్​

తమిళనాడు కోయంబత్తూరులోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్​ పూర్తి చేశారు రాజేశ్. భార్యతో సహా అమెరికాలోని నెవెడా రాష్ట్రంలో స్థిరపడ్డారు.

NRI
రాజేశ్​ రంగస్వామి

కోయంబత్తూరులో కరోనా రోగులు ఆక్సిజన్​ లేక, చికిత్సకు డబ్బులు లేక అవస్థలు పడుతున్నారనే విషయం తెలుసుకున్నారు. వెంటనే ఆర్తూర్​ కార్పొరేషన్ ట్రస్టు​ ద్వారా విరాళాల సేకరణ చేపట్టారు.

"సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి విరాళాలను సేకరించాము. విరాళంగా వచ్చిన రూ.కోటిని ఆసుపత్రులకు పంపించాము. అంతేకాకుండా 200 లీటర్ల ఆక్సిజన్​ ఉన్న సిలిండర్లను, 100లీటర్లను ఆక్సిజన్​ సిలిండర్లను ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చాము."

-రాజేశ్​ రంగస్వామి, ఎన్నారై

ఇదీ చదవండి: 'వ్యాక్సినేషన్​కు ఇబ్బంది లేకుండా తుపాను చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.