వాట్సాప్ ద్వారా కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. దానికి సంబంధించిన విషయాలను ఆదివారం ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.
'కొవిడ్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్‌కు MyGov కరోనా హెల్ప్‌డెస్క్ నంబర్ +91 9013151515ను ముందుగా సేవ్ చేసుకోవాలి. ఈ నంబరుకు 'కొవిడ్ సర్టిఫికేట్' అని ఇంగ్లీష్‌లో టైప్ చేసి వాట్సాప్ చేయాలి. తర్వాత మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే సర్టిఫికేట్ కొన్ని సెకన్లలోనే డౌన్‌లోడ్ అవుతుంది' అని ఆయన వివరించారు.
ప్రస్తుతం కరోనా టీకా ధ్రువపత్రం పొందాలంటే కొవిన్ పోర్టల్‌లో లాగిన్ అయి.. డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంది. సాంకేతికత సాయంతో సామాన్యుల జీవితంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కేంద్రమంత్రి ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: Flu Vaccine: కొవిడ్ ప్రతికూలతలకు ఫ్లూ టీకాతో చెక్!