అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్తర్న్ రైల్వే మహిళలకు ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చింది. చరిత్రలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన మహిళల పేర్లతో రైల్వే ఇంజిన్లను నడపాలని నిర్ణయించింది.
డబ్ల్యూడీపీ4బీ, డబ్ల్యూడీపీ4డీ కేటగిరీ ఇంజిన్లకు.. రాణి అహల్యాబాయి, రాణి అవంతిబాయి, రాణి లక్ష్మీబాయి, రాణి వేలునాచియార్, రాణి చెన్నమ్మ, జల్కారి బాయి, ఉదా దేవిలకు అంకితం చేసింది నార్తర్న్ రైల్వే.
5 దశాబ్దాలుగా నార్తర్న్ రైల్వే స్థిరమైన పనితీరు కనబరిచిందని ప్రజా సంబంధాల ముఖ్య అధికారి దీపక్ కుమార్ తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ధైర్యవంతులైన మహిళలు తుగ్లకాబాద్ లోకో షెడ్ కమిటీలో భాగస్వామ్యం కలిగి ఉన్నారని గుర్తుచేశారు. మహిళలకు గౌరవం ఇచ్చే విషయంలో రైల్వే ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పోలీసు వాహనాల్లో ప్రసవించిన మహిళలకు సత్కారం