దేశ రాజధాని దిల్లీ పంద్రాగస్టు వేడుకలు సిద్ధమౌతోంది. ప్రధాన ప్రాంతాల్లో త్రివర్ణ కాంతులతో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు ప్రజల ముఖాలపై జెండా రంగులు పులుముతున్నాయి. రహదారుల పక్కన చెట్లకు, భారీ భవంతులకు ఏర్పాటు చేసిన దీపాలతో వెలిగిపోతున్నాయి. జెండా పండుగ కోసం.... కేంద్ర సెక్రటేరియట్లోని నార్త్, సౌత్ బ్లాక్, కన్నాట్ ప్యాలెస్ చౌరాస్తా సహా ఇతర ప్రాంతాలను అందంగా ముస్తాబు చేశారు.


ఆగస్టు 15 వేడుకల కోసం ముంబయి మహా నగరం సిద్ధమవుతోంది. నగరంలో పలు ప్రాంతాలు త్రివర్ణశోభితమయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడి ప్రభుత్వ భవనాలైన ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, బృహన్ ముంబయి నగరపాలక సంస్థ (బీఎంసీ) భవంతులను శోభాయమానంగా తీర్చిదిద్దారు.


గువాహటిలోని ఈశాన్య రైల్వే హెడ్ క్వార్టర్ కూడా జెండా రంగుల విద్యుద్దీపాలతో వెలిగిపోతుంది. అంతేకాకుండా రానున్న పంద్రాగస్టు వేడుకలకు సంబంధించిన పలు దుకాణాల్లో సందడి నెలకొంది. చాలా షాపులు, బేకరీల్లో కేకులు జాతీయ జెండా రంగుల్లో దర్శనమిస్తున్నాయి.



ఇదీ చూడండి: దిల్లీలో 'పంద్రాగస్టు' సందడి- భద్రత కట్టుదిట్టం