ETV Bharat / bharat

'బూస్టర్‌ డోస్‌ అవసరమనేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు' - దేశంలో కరోనా బూస్టర్‌ డోసు

కరోనా బూస్టర్‌ డోస్‌(booster dose in India) అవసరమనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఐసీఎంఆర్​ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ స్పష్టం చేశారు. దేశంలో అర్హులైన ప్రతిఒక్కరికీ కరోనా రెండో డోసు ఇవ్వడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.

corona vaccine booster dose
కరోనా బూస్టర్​ డోస్​
author img

By

Published : Nov 22, 2021, 5:55 PM IST

దేశంలో కరోనా బూస్టర్‌ డోసు వినియోగంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్​) కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌(booster dose in India) అవసరమనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఐసీఎంఆర్​ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ స్పష్టం చేశారు. దేశంలో అర్హులైన ప్రతిఒక్కరికీ కరోనా రెండో డోసు ఇవ్వడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.

అంతకుముందు.. కరోనా నివారణ చర్యల్లో భాగంగా బూస్టర్ డోసులు(covid vaccine booster dose in india) ఇచ్చే విషయమై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఈ నెలాఖరులోగా ఓ విధానాన్ని ప్రకటించనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్​ డైరెక్టర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దేశంలో బూస్టర్‌ డోసు వినియోగంపై నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ ఇటీవల ప్రకటించారు. బూస్టర్‌ డోసుపై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోదన్న ఆయన.. నిపుణుల ఆదేశానుసారమే ప్రధాని నరేంద్ర మోదీ నడుచుకుంటారని స్పష్టం చేశారు.

డిసెంబరు 31నాటికి వయోజనులందరికీ టీకాలు వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతవరకు 43 శాతం మంది రెండు డోసులు వేసుకోగా.. 82 శాతం మంది మొదటి డోసును పూర్తి చేసుకున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.