ETV Bharat / bharat

'కొవిడ్​ కట్టడిలో సంతృప్తికి స్థానం లేదు' - కేంద్ర హోంశాఖ కార్యదర్శి

కొవిడ్​-19 కట్టడిలో సంతృప్తికి స్థానం లేదని, పాజిటివ్​ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని పేర్కొంది కేంద్రం. ప్రస్తుతం ఉన్న కొవిడ్​ మార్గదర్శకాలను ఆగస్టు 31 వరకు పొడిగించింది. నిబంధలనలు అమలయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.

Covid fight
కొవిడ్ మార్గదర్శకాల జారీ
author img

By

Published : Jul 28, 2021, 8:38 PM IST

దేశంలో కొవిడ్​ పాజిటివ్​ కేసుల సంఖ్య గణనీయంగా నమోదవుతున్న తరుణంలో మహమ్మారిని కట్టడిచేసే ప్రక్రియలో ఆత్మసంతృప్తికి స్థానం లేదని పేర్కొంది కేంద్రం. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది. ఆగస్టు 31 వరకు కొవిడ్​ మార్గదర్శకాలను పొడిగించింది.

ఐదు దశల వ్యూహం ' పరీక్షలు, బాధితుల గుర్తింపు, చికిత్స, టీకాల పంపిణీ, కొవిడ్​ నిబంధనల అమలు'ను తప్పనిసరిగా కొనసాగించాలని సూచిస్తూ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా. రానున్న పండగలు, ఉత్సవాల్లో కొవిడ్​ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

"కేసుల సంఖ్య తగ్గుతుండటం సంతృప్తికర అంశమే. కానీ మొత్తం కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ ఆత్మసంతృప్తికి స్థానం లేదు. జాగ్రత్తగా ఆలోచించి ఆంక్షలను తొలగించాలి. వైరస్​ పునరుత్పత్తి సంఖ్య(ఆర్​ ఫ్యాక్టర్​) 1 శాతం లోపే ఉండటం సానుకూలాంశం. కొన్ని రాష్ట్రాల్లో అంతకన్నా ఎక్కువగా ఉంది. ఆర్​ ఫ్యాక్టర్​ పెరగకుండా చూసుకోవాలి. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలి."

- అజయ్​ భల్లా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి

కొవిడ్​-19 కట్టడికి అవసరమైన చర్యలు తీసుకునేలా స్థానిక, జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కోరారు భల్లా. కొవిడ్​ నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత స్థానిక అధికారులదేనని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ప్రపంచ దేశాల్లో కేసులు తీవ్రం- మూడోవేవ్ మొదలైనట్టేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.