ETV Bharat / bharat

'వారిలో మూడో దశ వ్యాప్తిపై ఎలాంటి ఆధారాల్లేవ్​' - పిల్లల్లో కరోనా మూడో దశ

కరోనా మూడో దశలో పిల్లలపై తీవ్ర ప్రభావం ఉంటుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు ఎన్​టీఏజీఐ ఛైర్మన్​ ఎన్​కే అరోరా. కానీ ప్రస్తుత విజృంభణ దృష్ట్యా పీడియాట్రిక్​ సేవలు మెరుగుపరచాలని సూచించారు.

corona third wave on children, కరోనా మూడో దశ వ్యాప్తి
'పిల్లల్లో మూడో దశ ప్రభావం ఉండదు'
author img

By

Published : May 25, 2021, 12:41 PM IST

కరోనా మూడో దశ.. పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న విషయంపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు నేషనల్​ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్​ ఆన్ ఇమ్యూనిజేషన్ (ఎన్​టీఏజీఐ) ఛైర్మన్ ఎన్​కే అరోరా. అయితే ప్రస్తుత వైరస్​ విజృంభణ దృష్ట్యా పీడియాట్రిక్​ కొవిడ్​ సేవలను మెరుగుపరిచేందుకు మరిన్ని వనరులు అవసరం అని అన్నారు. ఇప్పట్లో మూడో దశ వ్యాప్తిపై ఎలాంటి అంచనాకు రాలేమని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"మూడో దశలో పిల్లలే ఎక్కువగా కొవిడ్​ బారిన పడతారు అనడానికి ఆధారాలు లేవు. కానీ నవజాత శిశువులు, పిల్లలు, గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. పీడియాట్రిక్​ సేవలు మెరుగుపరిచేందుకు కేంద్రం కృషి చేయాలి."

-ఎన్​కే అరోరా, ఎన్​టీఏజీఐ ఛైర్మన్

ఇటీవల ఎయిమ్స్​ డైరక్టర్​ రణదీప్​ గులేరియా కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. 'మూడో దశలో పిల్లలు ఎక్కువ ప్రభావితం అవుతారు అనడానికి ఆధారాలు లేవని' స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : 'కొవిడ్​ను నియంత్రించాలంటే టీకా పంపిణీ పెరగాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.