రైలు సర్వీసులను నిలిపివేయడం లేదా తగ్గించే ప్రసక్తే లేదని రైల్వేబోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రైళ్లను నడుపుతున్నామని చెప్పారు. డిమాండ్‌కు తగ్గట్టుగా మరిన్ని రైళ్లు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
దేశంలో కరోనా విజృంభణ దృష్ట్యా కొన్ని రాష్ట్రాల్లో మినీ లాక్డౌన్లు విధిస్తున్న నేపథ్యంలో సునీత్ శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"రైలు సర్వీసులను రద్దు చేయడం లేదా తగ్గించే ఆలోచన ఏదీ లేదు. అవసరానికి తగ్గట్టుగా రైలు సర్వీసులను నడుపుతాం. ఎక్కడైనా రద్దీ ఉంటే.. దానికి తగ్గట్టుగా వెంటేనే మరిన్ని రైళ్లను ఆ మార్గంలో నడుపుతాం. వేసవి కాలం కాబట్టి.. ఇప్పుడు అన్ని స్టేషన్లలో సాధారణ రద్దీనే ఉంది. ప్రయాణికులకు సరిపడా రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని నేను హామీ ఇస్తున్నాను."
-సునీత్ శర్మ, రైల్వే బోర్డు ఛైర్మన్
రైల్వే స్టేషన్‌కు భారీ సంఖ్యలో వచ్చే ప్రయాణికుల వద్ద నుంచి కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రాన్ని తాము అడగలేమని చెప్పారు సునీత్. మహరాష్ట్ర నుంచి రైళ్లను తగ్గించాలని లేదా నిలిపివేయాలని ఎలాంటి వినతులు రాలేదని వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆ స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ల అమ్మకాలు బంద్!