కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిదినాల తగ్గింపుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వారంలో నాలుగు రోజుల పనిదినాలను ప్రవేశపెట్టే ఆలోచనేదీ ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది. 'కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో నాలుగు రోజుల పనిదినాలు లేదా 40 పని గంటలను అమలు చేసే ప్రతిపాదన ప్రస్తుతం లేదు' అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ లోక్‌సభలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పని దినాలు/సెలవులు/పనిగంటలపై వేతన సంఘం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.
నాలుగో వేతన సంఘం సిఫార్సు ఆధారంగా వారంలో ఐదు రోజుల పనిదినాలు, రోజు ఎనిమిదన్నర పని గంటలను అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఏడో వేతన సంఘం యథాతథ స్థితిని కొనసాగించవచ్చని సిఫార్సు చేసినట్లు మంత్రి సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి : 50 ఏళ్లుగా ఎమ్మెల్యే- మోదీ అభినందనలు