ETV Bharat / bharat

'అన్నాడీఎంకేలో శశికళకు స్థానం లేదు'

author img

By

Published : Jun 5, 2021, 10:36 AM IST

తమిళనాట రాజకీయాల్లో శశికళ రీఎంట్రీపై స్పందించారు అన్నాడీఎంకే సీనియర్ నేత పళనిస్వామి. పార్టీలో శశికళకు స్థానంలేదని తేల్చిచెప్పారు. కార్యకర్తలను తప్పుదోవపట్టించే ప్రయత్నాలు సఫలం కావని అన్నారు.

VK Sasikala
శశికళ, వీకే శశికళ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ(Sasikala) రాజకీయ రీఎంట్రీపై వస్తున్న వార్తలపై స్పందించారు అన్నాడీఎంకే సీనియర్ నేత కే పళనిస్వామి(Palaniswami). శశికళ, ఆమె కుటుంబసభ్యులకు పార్టీలో చోటు ఉండదని తేల్చిచెప్పారు.

పార్టీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు తీసుకొచ్చేందుకు కొందరు ఆడియో టేప్​లు విడుదల చేశారని పళనిస్వామి ఆరోపించారు. కార్యకర్తలను తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావని అన్నారు.

'శశికళ ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీలో లేరు. ఆమెకు పార్టీతో సంబంధం లేదు. ఈ విషయాన్ని ఇంతకు ముందు కూడా స్పష్టం చేశాం' అని అన్నాడీఎంకే సీనియర్ నేత మునుస్వామి తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎన్నికల ముందు ఆమే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు.

ఇదీ చదవండి:

మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి శశికళ!

తమిళనాట శశికళ 'రీఎంట్రీ' దుమారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.