ETV Bharat / bharat

'యథాతథ స్థితి లేదంటే.. శాంతి లేనట్లే' - వాస్తవాధీన రేఖ ట్వీట్

చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితి ఏర్పడనంత వరకు.. ఉద్రిక్తతలు తగ్గవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు. జవాన్ల త్యాగాలను కేంద్రం అవమానిస్తోందని ఆరోపించారు.

No peace and tranquillity if there's no status quo ante at LAC: Rahul
రాహుల్ గాంధీ
author img

By

Published : Feb 11, 2021, 4:50 PM IST

వాస్తవాధీన రేఖ వెంట యథాతథ పరిస్థితి ఏర్పడకుండా.. ఉద్రిక్తతలు తగ్గే అవకాశమే లేదని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. భారత్ భూభాగాల నుంచి చైనాను తరిమికొట్టకుండా సైనికుల త్యాగాలను ప్రభుత్వం అవమానిస్తోందని దుయ్యబట్టారు. ఉద్రిక్తతల నివారణకు సైనికుల ఉపసంహరణపై భారత్‌-చైనాల మధ్య ఒప్పందం కుదిరినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. రాజ్యసభలో ప్రకటన చేసిన తర్వాత రాహుల్‌ ట్విట్టర్‌ వేదిక ద్వారా ఈ మేరకు స్పందించారు.

  • No status quo ante = No peace & tranquility.

    Why is GOI insulting the sacrifice of our jawans & letting go of our territory?

    — Rahul Gandhi (@RahulGandhi) February 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"యథాతథ స్థితి లేదంటే శాంతి, సుస్థిరతలు లేనట్లే. జవాన్ల త్యాగాలను అవమానించి దేశ భూభాగాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు వదిలేస్తోంది?"

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

బలగాల ఉపసంహరణపై భారత్-చైనా ఓ అంగీకారానికి వచ్చాయని రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్ ప్రకటన చేసిన నేపథ్యంలో రాహుల్ స్పందించడం గమనార్హం. ప్రతిష్టంభన తొలగించేందుకు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు ఫలించాయని రాజ్యసభలో తెలిపారు రాజ్​నాథ్. పూర్తి స్థాయి బలగాల ఉపసంహరణపై రానున్న రెండు రోజుల్లో కమాండర్​ స్థాయిలో చర్చలు జరగనున్నట్లు పేర్కొన్నారు. పాంగాంగ్​ ఉత్తర ప్రాంతంలోని ఫింగర్​ 8 వద్ద చైనా బలగాలు ఉంటాయన్న ఆయన.. భారత బలగాలు ఫింగర్​ 3 వద్ద ఉంటాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'ఏకాభిప్రాయమే మా ప్రభుత్వ మంత్రం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.