ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా మద్దతున్నంతవరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని బి.ఎస్.యడియూరప్ప అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఈ మేరకు స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా తన స్థానంలో మరొకరు నియమితులవుతారని కొందరు నాయకులు పగటి కలలు కంటున్నారని ప్రతిపక్షాలనుద్దేశించి దుయ్యబట్టారు.
ప్రజలు నాకు తోడుండగా, మోదీ, షా మద్దతుండగా నా స్థానాన్ని ఎవరూ మార్చలేరు. నాపై వస్తున్న వదంతులను తొలగించుకోగలను. నాపై మోపిన కేసుల నుంచి న్యాయపరంగా బయటపడగలను. మోదీ, షాలు నాపై నమ్మకం ఉంచినంత కాలం కేసుల గురించి ఆందోళన చెందను. వందల కేసులతో పోరాడగలను. రాజకీయ నాయకులపై తప్పుడు కేసులు ఎలా నమోదవుతాయో ప్రతిపక్షనాయకుడు సిద్ధారామయ్యకు బాగా తెలుసు.
_యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి
తనపై కక్షపూరితంగానే కేసులు నమోదు చేస్తున్నారని యడియూరప్ప చెప్పారు. కేసుల కారణంగా తన రాజీనామాను కోరుకునే కాంగ్రెస్ నాయకులు.. జాతీయ స్థాయి నాయకులపైనే ఎన్నో కేసులు నమోదయ్యాయన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.