భారత్లో తగినంత ప్రాణవాయువు నిల్వ ఉందని కేంద్ర హోం శాఖ తెలిపింది. కానీ.. ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుంచి అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలకు సరఫరా చేసే విషయంలో రవాణా సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. త్వరలోనే ఆ సమస్యను అధిగమిస్తామని స్పష్టం చేసింది.
వాయుసేన విమానాల సాయంతో ఆక్సిజన్ సిలిండర్లు రవాణా సమయాన్ని ఇప్పటికే 4-5 రోజుల నుంచి 1-2 గంటలకు తగ్గించామని హోం శాఖ అదనపు కార్యదర్శి పీయూష్ గోయల్ తెలిపారు.
"మనకు తగినంత ఆక్సిజన్ నిల్వ ఉంది. సమయానికి సరఫరా చేయడమే సమస్యగా మారింది. అయితే.. అందరూ చురుగ్గా పాల్గొనేలా చేసి ఈ సమస్యను పరిష్కరించేందుకు యత్నిస్తున్నాం."
- పీయూష్ గోయల్, హోంశాఖ అదనపు కార్యదర్శి
ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరతతో నలుగురు కరోనా రోగులు మృతి
ప్రాణవాయువు కొరత గురించి ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గోయల్ సూచించారు. సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్న ఆయన.. అతి తక్కువ సమయంలోనే ఆక్సిజన్ సిలిండర్లను ఆయా ఆస్పత్రులకు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు.
న్యూయార్క్ నుంచి 318 కాన్సంట్రేటర్స్..
దేశంలో ప్రాణవాయువు కొరతను తీర్చేందుకు న్యూయార్క్ నుంచి ఎయిర్ఇండియా విమానాల ద్వారా 318 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్(ప్రాణవాయువు తయారీ పరికరాలు) తీసుకొచ్చినట్టు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి సోమవారం తెలిపారు.
-
All efforts to strengthen India’s fight against the pandemic are on.
— Hardeep Singh Puri (@HardeepSPuri) April 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
318 Philips Oxygen Concentrators on @airindiain flight from JFK Airport land at @DelhiAirport.
Let there be no doubt.
We will turn the tide.@MoCA_GoI @MEAIndia @MoHFW_INDIA pic.twitter.com/Lz6S1Hlm99
">All efforts to strengthen India’s fight against the pandemic are on.
— Hardeep Singh Puri (@HardeepSPuri) April 26, 2021
318 Philips Oxygen Concentrators on @airindiain flight from JFK Airport land at @DelhiAirport.
Let there be no doubt.
We will turn the tide.@MoCA_GoI @MEAIndia @MoHFW_INDIA pic.twitter.com/Lz6S1Hlm99All efforts to strengthen India’s fight against the pandemic are on.
— Hardeep Singh Puri (@HardeepSPuri) April 26, 2021
318 Philips Oxygen Concentrators on @airindiain flight from JFK Airport land at @DelhiAirport.
Let there be no doubt.
We will turn the tide.@MoCA_GoI @MEAIndia @MoHFW_INDIA pic.twitter.com/Lz6S1Hlm99
"మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం 318 ఫిలిప్స్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను ఎయిర్ఇండియా విమానంలో తెప్పించాం."
- హర్దీప్సింగ్ పురి, పౌరవిమానయాన మంత్రి
ఇదీ చదవండి: ఉతక్కుండా కొత్త బట్టలు ధరించకూడదా?