ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో లాక్​డౌన్- యూపీలో స్కూళ్లు బంద్ - ఉత్తర్​ప్రదేశ్​ కర్ఫ్యూ

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్​డౌన్ విధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఛత్తీస్​గఢ్​లోని 16 జిల్లాల్లో లాక్​డౌన్ విధించగా.. మహాలో పూర్తి స్థాయి లాక్​డౌన్​పై చర్చ నడుస్తోంది. గుజరాత్​లో రాత్రి కర్ఫ్యూను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించారు. ఉత్తర్​ప్రదేశ్​లో పాఠశాలలు మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది యోగి సర్కార్.

states lockdown
రాష్ట్రాల్లో లాక్​డౌన్​
author img

By

Published : Apr 11, 2021, 9:42 PM IST

కరోనా కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వేళ రాష్ట్రాలు ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నాయి. ఛత్తీస్​గఢ్​లో కేసుల తీవ్రత అధికంగా ఉన్న రాయ్​పుర్, దుర్గ్​సహా 8 జిల్లాల్లో ఇప్పటికే లాక్​డౌన్​ అమలు చేస్తుండగా.. మరో 8 జిల్లాల్లో కూడా ఈ ఆంక్షలను అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి 3 జిల్లాల్లో 10 రోజులు, మిగతా జిల్లాల్లో ఆదివారం నుంచి 8 రోజుల పాటు లాక్​డౌన్​ అమల్లో ఉంటుంది.

ఛత్తీస్​గఢ్​లో 76వేలకు పైగా యాక్టివ్ కేసులుండగా రాయ్​పుర్​, దుర్గ్​జిల్లాల్లోనే సగం కేసులు ఉన్నాయి. మరోవైపు.. రైలు, వాయు మార్గం ద్వారా రాష్ట్రానికి రావాలనుకున్నవారు 72 గంటల లోపు పరీక్షించిన ఆర్​టీపీసీఆర్​ కరోనా నెగెటివ్​ ధ్రువపత్రం తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో కర్ఫ్యూ

గుజరాత్​ సైతం ఆంక్షలను కఠినతరం చేస్తోంది. ఇప్పటివరకు సూరత్​లోని పట్టణ ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ అమలులో ఉండగా, దానిని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ఆదివారం నుంచి ఏప్రిల్​ 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కర్ఫ్యూ రాత్రి 8గంటలకు ప్రారంభమై ఉదయం ఆరు గంటలకు ముగుస్తుంది. రాష్ట్రంలో​ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను ఈ నెల 30 వరకు మూసివేయాలని నిర్ణయించారు.

లాక్​డౌన్ వద్దు.. కరోనా కర్ఫ్యూనే ముద్దు!

రాష్ట్రంలో లాక్​డౌన్​ విధించే అవకాశం లేదని స్పష్టం చేశారు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​. కరోనా సంక్షోభానికి లాక్​డౌన్​ పరిష్కారం కాదన్నారు. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయితే, కొవిడ్​ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో సామూహిక కార్యకలాపాలను నివారించేందుకు కరోనా కర్ఫ్యూ(రాత్రి కర్ఫ్యూ) అమలు చేస్తామని తెలిపారు. వైరస్​ వ్యాపించకుండా కఠిన ఆంక్షలు విధించే అవకాశముందన్నారు.

నెలాఖరు వరకు పాఠశాలలు బంద్​

ఉత్తర్​ప్రదేశ్​లో ఈ నెలాఖరు వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్​ తెలిపారు. కోచింగ్ కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ముందుస్తు షెడ్యూల్​ ప్రకారం పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రార్థనా మందిరాల వద్ద ఐదుగురు కంటే ఎక్కువ మంది సమావేశమవకూడదని ఆదేశాలు జారీ చేశారు.

మహాలో లాక్​డౌన్​?

కరోనా విశ్వరూపం చూపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో లాక్​డౌన్​ విధించాలా? వద్దా? అనే విషయమై రాష్ట్ర కొవిడ్​ టాస్క్​పోర్స్​ సమావేశమైంది. కొందరు సభ్యులు రెండు వారాలు లాక్​డౌన్ విధించాలని.. మరికొందరు మూడు వారాలు విధించాలని ప్రతిపాదించినట్లు ఆ రాష్ట్ర మంత్రి అస్లాం షేక్ తెలిపారు. దీంతో సోమవారం మరోసారి భేటీ కానున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ఆ రాష్ట్రాల్లోనే 70శాతం కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.