Forced vaccination India: కరోనా టీకా తప్పనిసరిగా తీసుకోవాలని ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు సైతం.. అనుమతి లేకుండా చేసే బలవంతపు వ్యాక్సినేషన్‌ను పేర్కొనడం లేదని తెలిపింది.
India vaccination rules
టీకా ధ్రువపత్రం తప్పనిసరి అనే నిబంధన నుంచి దివ్యాంగులను మినహాయించాలని ఓ ఎన్జీఓ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందనగా.. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. వ్యాక్సినేషన్ ధ్రువపత్రం తప్పనిసరి అన్న నిబంధనను ఇంతవరకు విధించలేదని స్పష్టం చేసింది.
"ప్రస్తుత కరోనా సమయంలో వ్యాక్సినేషన్ అనేది ప్రజలందరి ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టే కార్యక్రమం. వివిధ పత్రికలు, మాధ్యమాల ద్వారా దీనిపై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. టీకా పంపిణీకి చేసిన ఏర్పాట్లు, కావాల్సిన అర్హతలపై వివరాలు తెలియజేస్తున్నాం. అయితే, ఇష్టం లేకుండా ఏ వ్యక్తికీ బలవంతంగా టీకా వేయడం లేదు."
-సుప్రీంకోర్టులో కేంద్రం
దివ్యాంగులకు టీకా పంపిణీ విషయమై ఎవారా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దివ్యాంగులకు ఇంటింటికి వెళ్లి టీకా వేసేలా చూడాలని ధర్మాసనాన్ని కోరింది.
ఇదీ చదవండి: లాటరీ టికెట్ కొన్న గంటలకే.. రూ.12 కోట్ల జాక్‌పాట్